https://oktelugu.com/

Mahesh Babu and Rajamouli : మహేష్ బాబు రాజమౌళి సినిమా సెట్ లో మెరిసిన తెలుగు స్టార్ హీరో…అతను కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడా..?

ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలు సైతం వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నారు...

Written By: , Updated On : January 30, 2025 / 02:55 PM IST
Mahesh Babu , Rajamouli

Mahesh Babu , Rajamouli

Follow us on

Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు…ముఖ్యంగా మహేష్ బాబు లాంటి నటుడు సైతం మంచి విజయాలను సాధించడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు ఒక్కడే హీరోగా ఎదిగాడు. మొత్తానికైతే కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నా మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. రాజమౌళి (Rajamouli) మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి ఆ షూట్ లో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను అయితే రాజమౌళి ఎక్కడ కూడా రివిల్ చేయడం లేదు. చాలా రహస్యంగా ఉంచుతూ ముందుకు సాగుతున్న ఈ సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుంది. అనే విషయాన్ని తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఫైట్ సీక్వెన్స్ ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారట. మరి ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా సెట్ లో ఒక స్టార్ హీరో పాల్గొన్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఆ స్టార్ హీరో ఎవరు అంటే విక్టరీ వెంకటేష్ (Venkatesh)గా తెలుస్తోంది.

నిజానికి వెంకటేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి సినిమా యూనిట్ ని కలవడానికి వెళ్ళాడా లేదంటే వెంకటేష్ తో కూడా ఒక చిన్న క్యారెక్టర్ ని చేయించే ఉద్దేశ్యం లో రాజమౌళి ఉన్నాడా అనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ కి మహేష్ బాబుకి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. వీరిద్దరి సొంత బ్రదర్స్ లా ఉంటారు. కాబట్టి ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో వెంకటేష్ మహేష్ బాబు అన్నగా నటిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. దానికోసమే షూటింగ్స్ స్పాట్ కి వెళ్లాలనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు కూడా రీసెంట్ గా వెంకటేష్ ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా యూనిట్ ని మొత్తాన్ని కలిసి వాళ్లతో సందడి చేశాడు. వెంకటేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి…చూడాలి మరి రాజమౌళి ఈ విషయం మీద స్పందిస్తాడా లేదా అనేది…