https://oktelugu.com/

F4 Movie Latest Update: F4 లో హీరోలు వెంకీ-వరుణ్ కాదా..!ఆ ఇద్దరి హీరోల కోసం అనిల్ రావిపూడి ప్రయత్నాలు??

F4 Movie Latest Update: అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన F3 సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా F2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది..అలాంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 31, 2022 / 01:30 PM IST

    F4 Movie Latest Update

    Follow us on

    F4 Movie Latest Update: అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన F3 సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా F2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది..అలాంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కాబట్టి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి..కరోనా లాక్ డౌన్ వల్ల అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు మే 27 వ తారీఖున విడుదల అయ్యింది..విడుదల రోజు మార్నింగ్ షోస్ ఆశించిన స్థాయి ఆక్యుపెన్సీలు రాకపోయినా, టాక్ అద్భుతంగా రావడం తో మాట్నీ షోస్ నుండి ఫ్యామిలీస్ క్యూ కట్టేసారు..దీనితో ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది..అలా మొదటి రోజు నుండి నేటి వరుకు స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ..ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ నంబర్స్.

    F3

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లేటెస్ట్ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అనిల్ రావిపూడి F3 కి కూడా సీక్వెల్ గా F4 తీస్తాను అని అనేక ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే F4 లో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లకు బదులుగా నేటి తరం స్టార్ హీరోలను తీసుకొని చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన లో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఉన్నాడట..F3 సినిమాలో నటించినందుకు గాను వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు భారీ మొత్తం మీద పారితోషికాలు తీసుకున్నారు అట..వెంకటేష్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటే, వరుణ్ తేజ్ 7 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి..వీళ్ళు ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం F2 సినిమా భారీ విజయం సాధించడం వల్లే..ఈ సినిమా ఆ స్థాయిలో హిట్ అవ్వడానికి కారణం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంత కారణమో..విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కూడా అంతే కారణం..వీళ్ళు పండించిన కామెడీ టైమింగ్ వల్లనే F2 సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది..అందుకే F3 సినిమాకి ఆ ఇద్దరు హీరోలు ఆ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్నారు అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త.

    Anil Ravipudi

    Also Read: R S Praveen Kumar- Akunuri Murali: ఆరెస్పె.. ఆకునూరితో మార్పు సాధ్యమేనా? వారు ప్రయత్నం పలించేనా!?

    ఇప్పుడు F3 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ హిట్ అయ్యిపోయింది..కచ్చితంగా F4 సినిమాకి వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు ఇంకా భారీ స్థాయి రెమ్యూనరేషన్లు తీసుకుంటారు..దీని వల్ల దిల్ రాజు ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోతుంది అనే ఫీలింగ్ ఉన్నాడట..దానికోసం వెంకటేష్-వరుణ్ తేజ్ లను కాకుండా, నేటి తరం సూపర్ స్టార్స్ ని పెట్టి తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనమే కదా అనే ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు..ఇదే విషయం అనిల్ రావిపూడి కి చెప్పగా ఆయన కూడా ఇందుకు ఏకీభవించినట్టు తెలుస్తుంది..దీనికోసం ఇప్పటి నుండే ఇద్దరు స్టార్ హీరోలతో అనిల్ రావిపూడి సంప్రదింపులు చెయ్యడం ప్రారంబించాడు అట..అయితే F2 ఫ్రాంచైజ్ కి ఈ స్థాయి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం వెంకటేష్ మరియు వరుణ్ తేజ్..వీళ్లిద్దరు లేని ఈ సిరీస్ ని ఊహించుకోవడం సాధ్యం కాదు..వీళ్ళు కాకుండా వేరే హీరోలు చేస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ఫలితం తేడా అయ్యే అవకాశాలు లేకపోలేదు..మరి అనిల్ రావిపూడి ఈ సినిమాకి వేరే హీరోలను పెట్టి జనాలను ఎలా మెప్పిస్తాడో చూడాలి..ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది..ఈ సినిమా పూర్తి అయినా తర్వాతే ఆయనే F4 ప్రాజెక్ట్ పై ద్రుష్టి సారించనున్నారు.

    Also Read: Anasuya Photo Gallary : అనసూయ షాకింగ్ లుక్.. భర్తతో ఇలా చేస్తూ..

    Recommended Videos


    Tags