Bandi Sanjay- kcr: గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలని మన జాతిపిత మహాత్మగాంధీ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని నేతలు చెబుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఫలితంగా అభివృద్ధి ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో పల్లెలు ఇంకా పురోగమనంలోకి రావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పల్లెలను ప్రగతి బాట పట్టించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకురావాలని చూస్తున్నా రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. నిధుల లేమితో పనులు సాగడం లేదు. దీంతోనే టీఆర్ఎస్ పల్లెలను పట్టించుకోవడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా పల్లెలు ప్రగతి బాట పట్టేందుకు ఉద్దేశించిన చట్టాలను అమల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో ఏళ్లుగా పంచాయతీలు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నాయి. సర్పంచులే సమిధలుగా మారుతున్నారు. గ్రామాల్లో చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తులమ్మి పెట్టి అప్పుల కూపంలో మునిగిపోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. సరికదా పనులు చేయని సర్పంచులను పదవి నుంచి తప్పించేందుకు కూడా వెనకాడటం లేదు.
Also Read: Africa Gold Mines: ఇక్కడ కేజీఎఫ్ రిపీట్ అయ్యింది.. రక్తం ఏరులైపారింది
సర్పంచులను వేధిస్తూ వారితో పనులు చేయించుకుంటూ వారికి రావాల్సిన నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో చేసిన అప్పులు తీరక వారికి నిత్యం నరకమే కనిపిస్తోంది. అప్పుల భారం నుంచి తప్పించుకునే దారి కనిపించడం లేదు. దీనిపై బీజేపీ యుద్ధం చేయాలని భావిస్తోంది. సర్పంచుల పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాటానికే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకుంది.
పనులు చేయని సర్పంచులకు జరిమానాలు విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీజేపీ మండిపడుతోంది. పంచాయతీలను ముప్ప తిప్పలు పెట్టే చట్టాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోంది. అందుకే సర్పంచుల పక్షాన నిలిచి రాజీలేని పోరాటం చేసేందుకు ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగానే పల్లెల్లో పనులు చేయాలని డిమండ్ చేస్తున్న ప్రభుత్వం అందుకనుగుణంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.
గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పనులు కుంటుపడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏది పట్టించుకోకుండా సర్పంచులను వేధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీలు ప్రగతి పథంలో నడవాలంటే నిధుల సమస్య ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ మేరకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.
కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ సర్పంచులను తమ వెంట ఉంచుకుని ఉద్యమించేందుకు రెడీ అవుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రామాణికంగా తీసుకుని వారిలో ఉత్సాహం నింపుతూ ప్రభుత్వంపై మరో సమరానికి సన్నద్ధమవుతున్నారు. పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి వారితో కలిసి పోరాడి వారి సమస్యలు తీర్చేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వారిలో ఆత్మవిశ్వాసం నింపి ప్రభుత్వంపై తిరగబడేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొత్తానికి రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ పై యుద్ధం చేసేందుకు సర్పంచులను తమకు అనుకూలంగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే వారిలో కలుగుతున్న ఆగ్రహానికి ఆజ్యం పోసి వారిని ప్రభుత్వంపై పోరుకు రెడీ చేస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్ వ్యూహం ఫలించి పంచాయతీలకు కొత్త కళ రానుందా అనే ఆశలు వస్తున్నాయి. మొత్తానికి బీజేపీ తీసుకున్న నిర్ణయంతో రాజకీయ పరిణామాలు మారుతాయా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
Also Read:R S Praveen Kumar- Akunuri Murali: ఆరెస్పె.. ఆకునూరితో మార్పు సాధ్యమేనా? వారు ప్రయత్నం పలించేనా!?