Virata Parvam: హీరో రానా – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన “విరాటపర్వం” ఎప్పుడో గతేడాదే రిలీజ్ కావాలి. కానీ, రిలీజ్ పై స్పష్టత లేదు. మరి, “విరాట పర్వం” టీమ్ ఏమి చేస్తోంది ? అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ క్రమంలో మేకర్స్ తట్టుకోలేక, అప్పటికప్పుడు జులై 1న మా సినిమాని విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. తాజాగా ఆ తేదీని మారుస్తూ.. మరింత ముందుకు సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
జూన్ 17న థియేటర్లలో ‘విరాట పర్వం’ మూవీ సందడి మొదలు కానుంది. సోషల్ మీడియా వేదికగా మారిన తేదీల వివరాల పోస్టర్లను తాజాగా రిలీజ్ చేశారు. పైగా ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా షురూ చేశారు. వచ్చే వారం నుంచి సాయి పల్లవి చేత ఇంటర్వ్యూలు ఇప్పించనున్నారు. అలాగే, రానా కూడా ఈ సినిమా కోసం కొత్త రకం ప్రమోషన్స్ ను ట్రై చేయనున్నాడు.
ఏది ఏమైనా ఎట్టకేలకు ‘విరాట పర్వం’ విడుదల కాబోతుందని, థియేటర్లోనే ఈ మూవీ వస్తుండటంతో దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటూ సాయి పల్లవి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. నిజానికి నెట్ ఫ్లిక్స్ తో హీరో రానాకి మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే తమ సంస్థలో నిర్మించిన “కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ కి మంచి రేట్ కి అమ్మేశాడు.
ఇక ఈ మధ్య “రానా నాయుడు” అంటూ ఓ వెబ్ సిరీస్ ను కూడా నెట్ ఫ్లిక్స్ కోసం చేశాడు. ఈ క్రమంలోనే “విరాటపర్వం” కూడా నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేయాలని రానా చాలా ప్రయత్నం చేశాడు. కానీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు మేకర్స్ ఒప్పుకోలేదు. థియేటర్ లో ఈ సినిమా సరిగ్గా ఆడదు అని రానా నమ్మకం. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
కాగా తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ విరాటపర్వం సినిమాలో ప్రధాన పాత్రల్లో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి నటించారు. అయితే, థియేటర్ లో రిలీజ్ చేస్తే విరాట పర్వంకు కలెక్షన్స్ ఎలా వస్తాయి అనే అనుమానం కూడా ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.
Also Read:Mahesh Babu And Namrata: కృష్ణకి.. మహేష్, నమ్రతా ఎలా ‘బర్త్ డే విషెస్’ చెప్పారో చూడండి !