https://oktelugu.com/

భల్లాలదేవతో బాలీవుడ్‌ క్వీన్‌ జోడీ

కంగనా రనౌత్‌. బాలీవుడ్‌ క్వీన్‌. ఎవ్వరి అండ లేకుండా హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందామె. నటనే కాదు నిజ జీవితంలోనూ దూకుడుగా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తుంది.. ఎంత పెద్దవారినైనా సరే నిలదిస్తుంది. అందుకే ఆమె పేరు ఎప్పుడూ వార్తల్లో నానుతుంది.ఈ బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌.. ఈ మధ్య పలువురు దర్శక, నిర్మాతలను ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బంధుప్రీతిపై, కొందరు సెలెబ్రిటీలపై ఆమె […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 07:26 PM IST
    Follow us on


    కంగనా రనౌత్‌. బాలీవుడ్‌ క్వీన్‌. ఎవ్వరి అండ లేకుండా హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందామె. నటనే కాదు నిజ జీవితంలోనూ దూకుడుగా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తుంది.. ఎంత పెద్దవారినైనా సరే నిలదిస్తుంది. అందుకే ఆమె పేరు ఎప్పుడూ వార్తల్లో నానుతుంది.ఈ బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌.. ఈ మధ్య పలువురు దర్శక, నిర్మాతలను ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బంధుప్రీతిపై, కొందరు సెలెబ్రిటీలపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. వివాదాలకే కాదు సినిమాల విషయంలో కూడా ఆమె చాలా స్పీడ్‌. ఓవైపు సుశాంత్‌ సూసైడ్‌ పై తరచూ మీడియాలో మాట్లాడుతూ బిజీగా ఉన్న కంగనా అంతలోనే ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసింది. అందులో ప్రత్యేకత ఏముందంటరా? ఉంది.

    Also Read: కరోనాను జయించిన ఐశ్యర్యా రాయ్‌..

    కంగనా ఫస్ట్‌టైమ్‌ మన భల్లాలదేవ దగ్గుబాటి రానాతో కలిసి నటించనుంది. రానాతో కలిసి ఓ మూవీ చేయబోతున్నట్టు ఆమెనే వెల్లడించింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ ముచ్చటను అభిమానులతో పరోక్షంగా పంచుకుంది. ఎగ్జయిటింగ్‌ అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్‌ గురించి రానా దగ్గుబాటితో వర్చువల్‌ మీటింగ్‌కు రెడీ అయ్యాను అంటూ రెడ్‌ డ్రెస్‌లో తీసుకున్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ఈ అమ్మడు. దాంతో, రానా, కంగనా పెయిర్ కన్ఫర్మ్‌ అయింది. అయితే, ఇది హిందీ సినిమానా? తెలుగు సినిమానా? లేదంటే వెబ్‌ సిరీసా? అన్నది తేలాల్సి ఉంది. అలాగే, ఆ ప్రాజెక్ట్‌ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌ ఎవరన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

    Also Read: సిక్స్‌ ప్యాక్‌తో సక్సెస్‌కు ‘గురి’ పెట్టిన నాగశౌర్య

    తెలుగులో కంగనా ఇది వరకే ఓ మూవీ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్‌ సరసన ‘ఏక్‌ నిరంజన్‌’మూవీలో నటించింది. అప్పటికి హిందీలో ఆమెకు పెద్దగా స్టార్డమ్‌ రాలేదు. అయితే, ఆ మూవీ అంతగా హిట్‌ కాకపోవడంతో టాలీవుడ్‌లో మరో సినిమా చేయలేదు. కానీ, కొంతకాలానికి హిందీలో ఆమె టాప్‌ హీరోయిన్‌గా మారింది. ‘క్వీన్‌’ మూవీ ఆమె కెరీర్ను మలుపుతిప్పింది. ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఆమె రీసెంట్‌గా సౌత్‌పై కన్నేసింది. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న తమిళ చిత్రం ‘తలైవి’లో నటిస్తోందామె.