https://oktelugu.com/

కరోనాను జయించిన ఐశ్యర్యా రాయ్‌..

బాలీవుడ్‌ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముందు అమితాబ్‌ ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు వైరస్‌ నిర్ధారణ అయింది. ఆ వెంటనే కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించగా.. ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ అని తేలగా… మిగతా వాళ్లకు నెగెటివ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. అమితాబ్‌, అభిషేక్‌ వెంటనే ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరగా.. తొలుత ఇంట్లోనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 07:15 PM IST
    Follow us on


    బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముందు అమితాబ్‌ ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు వైరస్‌ నిర్ధారణ అయింది. ఆ వెంటనే కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించగా.. ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ అని తేలగా… మిగతా వాళ్లకు నెగెటివ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. అమితాబ్‌, అభిషేక్‌ వెంటనే ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరగా.. తొలుత ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న ఐశ్వర్య, ఆరాధ్య కూడా రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరి ఆరోగ్యం గురించి రోజుకో వార్త వస్తోంది. అయితే, అభిషేక్‌ బచ్చన్‌ ఈ రోజు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తన భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ‍్య కరోనాను జయించారని తెలిపాడు. కరోనా నుంచి కోలుకున్నారన్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ అని రావడంతో ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారని ట్వీట్‌ చేశాడు. అయితే. తన తండ్రి అమితాబ్, తాను ఇంకా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నామని చెప్పాడు. తమ క్షేమం కోరుకుంటున్న వారందరికీ అభిషేక్‌ థ్యాంక్స్‌ చెప్పాడు.

    Also Read: విద్యా బాలన్ మళ్ళీ అందాల అరబోతకు సై !

    ఐశ్వర్యతో పాటు చిన్నారి ఆరాధ్య కరోనా జయించడం పట్ల బచ్చన్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బిగ్‌బీ అమితాబ్‌ ఆరోగ్యంపై మాత్రం వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కరోనా మరణాల్లో వృద్ధులే అధికంగా ఉన్నారు. దాంతో, 77 ఏళ్ల అమితాబ్‌ గురించి బెంగ పెట్టుకున్నారు. బిగ్‌బీకి కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం కూడా వారి ఆందోళనను పెంచుతోంది. అయితే, తాను బాగానే ఉన్నానని, కోలుకుంటున్నానని అమితాబ్‌ చెబుతున్నాడు. హాస్పిటల్‌లో ఉన్నప్పటికీ ట్విట్టర్ ద్వారా తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులు ఒంటరి తనం అనుభవిస్తున్నారని, తనకు కూడా తొలుత అదే ఫీలింగ్‌ కలిగిందని చెప్పాడు. దాంతో, తాను పాటలు పాడుకుంటూ ఒంటరితనాన్ని దూరం చేస్తుకుంటున్నానని పేర్కొన్నాడు. అమితాబ్‌, అభిషేక్‌ త్వరగా కోలుకొని ఇంటికి చేరుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు.

    https://twitter.com/juniorbachchan/status/1287697590000132103