AR Rahman: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ని అందించి, కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని, ఆస్కార్ అవార్డు ని కూడా కైవసం, చేసుకున్న AR రెహమాన్(AR Rahman) లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు పెద్ద కలకలం రేపింది. భారతదేశం లో పవర్ షిఫ్ట్ అయ్యాక (కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత) తనకు బాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెప్పుకొచ్చాడు. అంతటి లెజండ్ నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడాన్ని ఆయన వీరాభిమానులు సైతం తీసుకోలేకపోతున్నారు. అంటే పరోక్షంగా AR రెహమాన్ బీజేపీ హిందూ పార్టీ కాబట్టి, ముస్లిమ్స్ కి వ్యతిరేకం అని, తాను ముస్లిం కాబట్టే సినిమా అవకాశాలు తగ్గిపోయాయని రెహమాన్ పరోక్షంగా కామెంట్స్ చేసినట్టు సోషల్ మీడియా లో నెటిజెన్స్ అర్థం చేసుకొని రెహమాన్ ని తప్పుబడుతున్నారు.
SHOCKING STATEMENT BY A.R RAHMAN
“Chhaava is a divisive film, it cashed on divisiveness. Urdu was the mother of Hindi film music in 1960s and 1970s”
“I have stopped getting work bcoz of shift in Power in India ”#ARRahman #Chhaava pic.twitter.com/s6CxfvFtGN
— Kushal Sharma (@KushalSharma_89) January 17, 2026
రెహమాన్ సంగీతాన్ని కుల మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. రీసెంట్ గానే ఆయన రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. అందులో ఆయన కంపోజ్ చేసిన ‘చికిరి చికిరి’ పాటకు ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ పాటకు చిందులు వేశారు. ఇది రెహమాన్ కి కొత్తేమి కాదు, గతం లో ఆయన కంపోజ్ చేసిన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ పాటలు ఈ రేంజ్ లోనే ఆదరణ పొందాయి. అన్ని మతాలకు చెందిన వారు ఆదరించబట్టే అవన్నీ అంత పెద్ద హిట్ అయ్యాయి, రెహమాన్ అనేవాడు ఇంత పెద్దవాడు అయ్యాడు. అలాంటి రెహమాన్ చెయ్యాల్సిన కామెంట్స్ కావు ఇది, ఆయన స్థాయిని దిగజార్చే వ్యాఖ్యలు ఇవి , తక్షణమే ఆయన ఈ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో వచ్చిన ఈ నెగిటివిటీ ని గమనించిన AR రెహమాన్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక వీడియో ని అప్లోడ్ చేసి, క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘మిత్రులారా, మన భారతీయ సంస్కృతి ని నేను సంగీతం ద్వారా కోట్లాది మంది జనాలకు కనెక్ట్ చేస్తూ, సెలబ్రేట్ చేసుకున్నాను. భారత దేశం నాకు ఆదర్శం, నా గురువు, నా ఇల్లు కూడా. నేను మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినవి కాదు, కొన్ని కొన్ని సార్లు మన ఉద్దేశ్యాలు మంచివే అయినప్పటికీ, అది బయటకు ప్రొజెక్ట్ అయ్యేది వేరే విధంగా ఉంటుంది. నన్ను ఇంతటి వాడిని చేసిన మీ మనసుల్ని నొప్పించే ఉద్దేశ్యం నాకు లేదు, దయచేసి అర్థం చేసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.
View this post on Instagram
