Sankranthi Release Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.ఇక సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోలు వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక రవితేజ హీరోగా వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకి సైతం భారీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఈ సినిమా 80% బడ్జెట్ ను రికవరీ చేసింది. ఇంకా 20% బడ్జెట్ ను రికవరీ చేసినట్టయితే మాత్రం ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా సైతం పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది.
ఈ సినిమా మూడు రోజుల్లో 75 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. అంటే నవీన్ పోలిశెట్టి కి ఉన్న మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తను కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు కాబట్టి తన నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ అయితే దక్కుతోంది…
శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా సైతం పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఈ సినిమాలన్నీ సంక్రాంతి హిట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా మాత్రం భారీగా డీలా పడిపోయిందనే చెప్పాలి. సంక్రాంతికి ఫ్యామిలీ కామెడీ సినిమాలన్నీ రావడం అవన్నీ మంచి కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండటం వల్ల ఈ సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ చేసిన ప్రయోగం సక్సెస్ కాలేదు. దాంతో ఇక మీదట ప్రభాస్ ప్రయోగాలు చేయకూడదనే ఉద్దేశ్యంతో ఆయన అభిమానులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం…ఇక సంక్రాంతి సినిమాల్లో మన శంకర వరప్రసాద్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా దగ్గర్లో ఉంది. అనగనగా ఒక రాజు సినిమా సైతం ప్రాఫిట్ సాధించే దిశ గా ముందుకు సాగుతుంది. ఇక మరి మరి నడుమ మురారి సైతం ఇప్పటి వరకు 60% కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతుండటం విశేషం…
