AR Rahman: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలను ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకి ఎక్కువ మంది అభిమానులైతే ఉంటారు. ఇక వాళ్ళ సినిమాలకి రీచ్ కూడా ఎక్కువగానే ఉంటుంది… ఒక సినిమా సక్సెస్ అవ్వడంలో దర్శకుడితో పాటు సంగీత దర్శకుడికి కూడా కీలకపాత్ర ఉంటుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఒక సినిమాలో సాంగ్స్ సూపర్ సక్సెస్ అయినప్పుడే ఆ సినిమాని చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. ఆ సాంగ్స్ వల్ల సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. అందుకే సినిమాకి ఆడియన్స్ ను రప్పించడంలో మ్యూజిక్ డైరెక్టర్ కీలకపాత్ర వహిస్తాడు. అలాగే సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో కూడా ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి ఒక ఆ భారీ క్రేజ్ తీసుకొస్తాడు.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
ఇక ఇలాంటి క్రమంలోనే ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీని ఎలుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించడం లేదు.
ఆయన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమాకి సైతం తనే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో వచ్చిన ‘చికిరి చికిరి’ అనే సాంగ్ బాగా ఫేమస్ అయినప్పటికి రీసెంట్ గా వచ్చిన రై రై అనే సాంగ్ ఏమాత్రం మెప్పించడం లేదు. అసలు అది సాంగ్ లానే అనిపించడం లేదంటూ ప్రేక్షకులు విమర్శలైతే చేస్తున్నారు.
ఇక అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ప్యారడైజ్ సినిమాకి సాంగ్స్ ను టాప్ లెవల్లో నిలిపాడు. రీసెంట్ గా వచ్చిన ఆయా షేర్ సాంగ్ తో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక అనిరుధ్ తో రెహమాన్ ను పోలుస్తూ రెహమాన్ పని అయిపోయింది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనిరుధ్ తో పోటీపడేంత రేంజ్ రెహమాన్ కైతే లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు…