AP Theaters Issue: ఏపీలో థియేటర్ల వ్యవహారం పై జరుగుతున్న దుమారం పై సినిమా వాళ్లల్లో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రభుత్వం పై పోరాటం చేద్దాం అంటుంటే.. మరికొంతమంది ప్రభుత్వంతో గొడవ లేకుండా సమస్యలను పరిష్కరించుకుందాం అంటూ ఇలా ఎవరికీ తోచిన సలహా వాళ్ళు ఇస్తున్నారు. ఈ మధ్యలో టాలీవుడ్ కు చెందిన కొందరు సినీ ప్రముఖులు జగన్ ప్రభుత్వం పై తమ అసంతృప్తిని వ్యక్తపరిచే ధైర్యం చేస్తున్నారు.

అయితే, ఆ ధైర్యం సినీ పెద్దలలో కొందరికి అసలు నచ్చడం లేదు. టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సమంజసం కాదు అంటూ హీరో నాని తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. అలాగే నానితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఇలాంటి కామెంట్స్ నే చేశారు.
Also Read: Tollywood vs Jagan: సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా?
అయినా, సభ్య సమాజంలో మనకు ఉన్న భావ స్వేచ్ఛ ప్రకటనతో ఎవరైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. కానీ అది జగన్ కి అస్సలు నచ్చడం లేదు. ఎవరైతే తన ప్రభుత్వం పై విమర్శలు చేశారో.. వారిని టార్చర్ చేసే విధంగా జగన్ తన మంత్రులతో తగిన విధంగా చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఈ మధ్యలో టాలీవుడ్ కు చెందిన కొందరు మాత్రం ఏపీ ప్రభుత్వంను సమర్థిస్తూ జగన్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తాజాగా దిల్ రాజు ఓ మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో త్వరలోనే భేటీ అవ్వబోతున్నట్లుగా దిల్ రాజు ప్రకటించాడు. మరి టికెట్ల రేట్ల విషయంలో సినిమా జననానికి ఏమైనా మేలు జరుగుతుందా ? చూడాలి.
Also Read: Manchu Vishnu: మంచు విష్ణు ఎక్కడ ? ఇంత సంక్షోభం లో కనీస బాధ్యత ఉండాలి కదా