Tollywood Actress: సీనియర్ హీరోయిన్ శ్రియ అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అసలుకే సౌత్ సినిమాల్లో మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వయసులో చాలా షరతులు ఉన్నాయి. ముప్పై దాటితే.. ఇక ఆమెను సీనియర్ హీరోయిన్ కింద లెక్క గట్టేస్తారు. అదే హీరోలకు 60 ఏళ్లు దాటినా వాళ్ళు యంగే. అది వేరే విషయం అనుకోండి.

ఏది ఏమైనా హీరోయిన్ల కెరీర్ అనేది చాలా తక్కువ సమయం. అయితే, ఇది తనకు అసలు నచ్చలేదు అంటుంది శ్రియా. ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. పెళ్లి అయి పాప పుట్టినా శ్రియ మాత్రం అవకాశాల కోసం ఇంకా ఆశ పడుతూనే ఉంది. ఎలాగూ తనకు ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలొస్తున్నాయని చెబుతుంది.
Also Read: Samantha: బికినీలో హాట్లుక్స్తో కవ్విస్తోన్న సమంత.. గోవా టూర్లో ఎంజాయ్
నిజానికి ఆల్ రెడీ కెరీర్ లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కానీ ప్రస్తుతం ఆమెకు అసలు అవకాశాలే లేవు అని తెగ బాధ పడుతుంది. సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి అనుకుంటే.. ఆ ఛాన్స్ లు కూడా రావడం లేదు. మరి సినిమాలు మానేసి ఖాళీగా కూర్చోలేదు. పైగా తన ఫ్యామిలీ మొత్తంగా తన సంపాదన పైనే ఆధారపడి ఉంది.
అందుకే, కనీసం ఇక నుంచి అక్క, వదిన పాత్రలలోనైనా నటించాలని శ్రియా ప్లాన్ చేసుకుంటుంది. అయితే, ప్రస్తుతం పరిశ్రమలో గడ్డు రోజులు ఎదుర్కొంటున్న తారలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అక్క, వదిన పాత్రల కోసం పోటీ పడుతున్నారు. మరోపక్క స్నేహ, ప్రియమణి లాంటి వారు ఆల్ రెడీ ఆ పాత్రలకు ఖర్చీప్ వేసి కూర్చున్నారు. మరి చివరకు శ్రియా కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి.
Also Read: Akhanda 25 Days Collections: అఖండ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !