Anushka Role in Movie Ghati : గత 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న నటీమణులు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో అనుష్క ఒకరు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ ఆమెకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అనుష్క ప్రస్తుతం ఘాటీ అనే సినిమా చేస్తుంది. క్రిష్ (Krish) డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా జులై రెండోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఈ సినిమా మీద చాలా అంచనాలైతే ఉన్నాయి.
క్రిష్ (Krish) అనుష్క (Anushka) కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన వేదం (Vedam) సినిమా వాళ్ళిద్దరికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ముఖ్యంగా నటన పరంగా అనుష్కకు చాలా గొప్ప పేరు అయితే వచ్చింది. మరి ఆ రేంజ్ లోనే ఈ సినిమా కూడా తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెడుతుందనే ఉద్దేశ్యంతో ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘ఘాటి’ గ్లింప్స్ లో అనుష్క చేసిన ఆ ఒక్కటి అతిగా అనిపిస్తుందా..?
ఇక ఈ సినిమాలో ఆమె ఒక రెబల్ క్యారెక్టర్ ను పోషించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ని కనక మనం చూసినట్లయితే అందులో ఆమె ఒకడి తలకాయను కోసి పట్టుకొని వెళ్లే షాట్స్ చాలా అద్భుతంగా నిలిచాయి. కాబట్టి ఈ సినిమా ఆమెకు నెక్స్ట్ లెవెల్ గుర్తింపుని తీసుకురావడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని తీసుకొచ్చి పెడుతుందనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఈ సినిమా ఏ రేంజ్ లో అయితే సక్సెస్ ని సాధించబోతుందో ఇకమీదట చేయబోయే సినిమాలు కూడా అంతకుమించి ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఆమె తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది…ఇక మీదట కూడా మరికొంత మంది స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది…