Metro Expansion Plans Hyderabad : ఇన్ని సమస్యలున్నాయి కాబట్టి.. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి.. అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్న ఆకాస్తా పనులను కూడా చెప్పుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా గురించి.. ఇతర వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ స్థితిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి వార్త చెప్పింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలను వెల్లడించినప్పుడు భారత రాష్ట్ర సమితి తెలంగాణ వ్యాప్తంగా పండుగ చేసేది.. అడుగు ముందుకు పడకపోయినప్పటికీ.. ఏదో చేసినట్టు డబ్బా కొట్టుకునేది. కానీ ఇంతటి గేమ్ చేంజర్ లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. అవి తెలంగాణ అభివృద్ధికి.. ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కు దోహదం చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ చెప్పుకోవడం లేదు. చెప్పుకోవడం ఆ పార్టీకి చేతకావడం లేదు. ఇంతకీ తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వరాలు ఏమిటో.. అది గేమ్ చేంజర్ ఎలా కాబోతుందో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : ఏపీ మెట్రో ప్రాజెక్టులు.. కేంద్రం అంగీకరిస్తుందా?
చాలా రోజుల తర్వాత తెలంగాణ క్యాబినెట్ భేటీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు మొత్తం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనేక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మీడియా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.. ఇందులో ప్రముఖంగా ఆయన ప్రస్తావించింది హైదరాబాదులో మెట్రో రైలు రెండవ దశ విస్తరణకు సంబంధించి.. మొత్తంగా 19,579 కోట్ల ఖర్చుతో హైదరాబాదులో రెండవ దశ మెట్రోను విస్తరిస్తారు. మొత్తంగా మూడు రూట్లలో రెండవ దశ మెట్రో నిర్మిస్తారు. ఇది మొత్తం 86.1 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. కారిడార్ -1 లో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి భవిష్య నగరి వరకు 39.6 కిలోమీటర్ల పొడవులో మెట్రో రైలు మార్గం నిర్మిస్తారు.. కారిడార్ -2 లో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల పొడవులో మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కారిడార్ -3 లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మిస్తారు.
అయితే మెట్రో విస్తరణ మొత్తం కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు..” హైదరాబాదు నగర అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే మెట్రో రైలు మార్గాన్ని వివిధ దశలో పూర్తి చేస్తాం. దీనివల్ల హైదరాబాద్ శివారు ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి.. ఆదాయం కూడా భారీగా వస్తుంది. తద్వారా హైదరాబాద్ దేశానికి ఆర్థిక రాజధానిగా రూపాంతరం చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడతాయి.. తద్వారా తెలంగాణ ఆదాయం పెరుగుతుందని” శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్లో మెట్రో రైలు ఫేస్ 2 విస్తరణకు క్యాబినెట్ ఆమోదం
రూ.19,579 కోట్లతో హైదరాబాద్ మెట్రో విస్తరణ
86.1KM మేర 3 రూట్లలో సెకండ్ ఫేజ్ మెట్రో నిర్మిస్తాము
కారిడార్-1లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6KM
కారిడార్-2లో భాగంగా JBS నుంచి మేడ్చల్ వరకు… pic.twitter.com/OEJtxtJrQ3
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2025