Raghavendra Rao- Anushka: హీరోయిన్ అనుష్క శెట్టికి చాలా పాజిటివ్ ఇమేజ్ ఉంది. అనుష్కది డౌన్ టు ఎర్త్ నేచర్. అందరినీ గౌరవిస్తారు. చాలా సున్నితమైన మనసున్న అమ్మాయి. వివాదాలకు దూరంగా ఉంటుంది. ఇక అందం గురించి చెప్పాల్సిన పని లేదు. అనుష్కను కోడలు చేసుకోవాలని దర్శకుడు రాఘవేంద్రరావు భావించారట. తన కొడుకు ప్రకాష్ రావును పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. రాఘవేంద్రరావు ప్రపోజల్ ని అనుష్క సున్నితంగా తిరస్కరించారట.
అనంతరం ప్రకాష్ రావు బాలీవుడ్ రచయిత కనిక కపూర్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక బంధం ఎంతో కాలం సాగలేదు. కారణాలు ఏమైనా విడాకులు తీసుకుని విడిపోయారు. దాంతో రాఘవేంద్రరావు మరోసారి అనుష్క వైపు మొగ్గు చూపారట. ప్రకాష్ రావును వివాహం చేసుకుంటావా అని అడుగుదాం అనుకున్నారట. మొదటిసారే ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు రెండో పెళ్లి. ఒప్పు కుంటుందా అని సంశయించి వదిలేశారట.
ఆ మధ్య ఈ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ప్రకాష్ రావు విడాకుల అనంతరం అనుష్క ఆయన్ని వివాహం చేసుకుంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై అనుష్క స్పందించలేదు. నిజమే అని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. కాగా చాలా కాలంగా అనుష్క-ప్రభాస్ ప్రేమలో ఉన్నారనే పుకార్లు ఉన్నాయి. ఈ విషయం వారిద్దరి వద్దకు వెళ్ళింది.
బాహుబలి సిరీస్ కోసం దాదాపు ఐదేళ్లు కలిసి పని చేశారు. దాంతో ప్రేమ చిగురించిందని పెళ్లి చేసుకుంటారంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలను అనుష్క ఖండించారు. సాహో చిత్ర ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఎక్కడికెళ్లినా ఈ ప్రశ్న వెంటాడింది. అనూహ్యంగా అనుష్క, ప్రభాస్ ఒంటరిగానే ఉండిపోతున్నారు. వారిద్దరూ 40 ప్లస్ లో ఉన్నారు. ఇక పెళ్లి చేసుకునే ఆలోచన కూడా వారిలో లేనట్లు ఉంది.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Director raghavendra rao wanted to make anushka daughter in law do you know why he backed down
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com