NTR: నట వారసత్వం చాలా కామన్. నిజానికి ఇది అన్ని రంగాల్లో ఉండేదే. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కావడంతో దీనిపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. నెపోటిజం అంటూ అసహనం వ్యక్తం చేసే వర్గం ఉంది. అయితే అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రతి స్టార్ హీరో వారసుడు స్టార్ గా ఎదగాలని ఆ లెగసి కంటిన్యూ చేయాలని అభిమానులు భావిస్తారు. ఇది ఆధిపత్యం, పరువుకు సంబంధించిన విషయంగా కూడా భావిస్తారు. అయితే స్టార్స్ వారసులు అందరూ స్టార్స్ కాలేరు. ఎంత పుష్ చేసినా టాలెంట్ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.
నందమూరి తారక రామారావుకు 8 మంది కుమారులు. వారిలో బాలకృష్ణ మాత్రమే స్టార్ అయ్యారు. హరికృష్ణ ఓ మోస్తరు నటుడిగా రాణించారు. మిగతా ఆరుగురు నిర్మాతలుగా, వ్యాపారస్తులుగా స్థిరపడ్డారు. ఇక మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న, చైతన్య కృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎన్టీఆర్ ఒక్కడే స్టార్ అయ్యాడు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ వద్దామా వద్దా? అనే మీమాంసలో ఉన్నాడు.
Also Read: Jagapathi Babu: హీరోయిన్స్ తో షాపింగ్ లు, పార్టీలు… జగపతిబాబు దివాళా తీయడానికి అసలు కారణం ఇదా!
కాగా నందమూరి కుటుంబం నుండి మరో వారసుడు వస్తున్నాడు. అతడి పేరు కూడా ఎన్టీఆర్ కావడం విశేషం. ఈ కొత్త ఎన్టీఆర్ ఎవరో కాదు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కొడుకు. టీనేజ్ దాటేసిన ఈ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. జానకిరామ్ 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పేరు నందమూరి తారక రామారావు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా.. ఆయన చివరి సినిమా ఇదేనా..?
ఈ యంగ్ ఎన్టీఆర్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేస్తున్న దర్శకుడు మరెవరో కాదు వైవీఎస్ చౌదరి. నందమూరి కుటుంబానికి వీర విధేయుడు, సీనియర్ ఎన్టీఆర్ భక్తుడు అయిన వైవిఎస్ చౌదరి వరుస ప్లాప్స్ తో ఆర్థికంగా నష్టపోయి చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఆయన కమ్ బ్యాక్ ఇస్తూనే హరికృష్ణ మనవడిని హీరోగా పరిచయం చేస్తున్నాడట. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం.