Relationship : భార్యభర్తలు ఎన్ని గొడవలు వచ్చినా సరే కలిసిమెలిసి ఉండాలి కానీ చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు నేటి జంటలు. కానీ ఒకప్పుడు మాత్రం ఎన్ని గొడవలు జరిగినా కలిసే ఉండేవారు. కొందరు మాత్రమే విడిపోయేవారు. భార్యా భర్తల మధ్య బంధం ఏ కారణం ఉన్నా సరే తెగిపోవడం కామన్ గా మారింది. ఇక కొందరి మధ్య మాత్రం ఇగో వల్ల కూడా విడిపోతుంటారు. మొత్తం మీద విడిపోతే మెయింటెనెన్స్ పొందడం కోసం కోర్టులో భార్య అప్లే చేసుకుంటుంది. మరి దీని కోసం భార్య ఎలాంటి సాక్ష్యాలు చూపించాలో చూద్దాం..
భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం కామన్. కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తే ఆ బంధంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొన్ని సార్లు ఈ గొడవలు మాత్రం విడాకుల వరకు దారి తీస్తుంటాయి. ఈ క్రమంలో విడాకులు తీసుకుని భార్యభర్తలు విడిపోయినపుడు కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశిస్తుంది.
ఇద్దరు విడిపోయినప్పుడు పిల్లలను చూసుకోవడానికి లేదంటే తన మెయింటెన్స్ కోసం భర్త వద్ద నుంచి మెయింటెన్స్ తీసుకోవచ్చు. ఆమె ఆహారం, వసతి, దుస్తులతో పాటుగా వారి పిల్లల చదువు, ఇతర బాగోగులను కూడా భర్త చూసుకోవాలి. కోర్టు ఆదేశించినా భర్త ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వకపోతే సదరు భార్య మెయింటెనెన్స్ పొందడం కోసం కోర్టుకు వెళ్ళవచ్చు. కానీ ఇలాంటి సమయంలో మాత్రం కొన్ని ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
తనను తాను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని, తన భర్త పోషించే స్థితిలో ఉన్నాడనే ఆధారాలు ఇవ్వాలి. అలాగే తమది చట్టబద్ధమైన వివాహం అనే మాదిరి ఓ సాక్ష్యం సాక్ష్యం కూడా కావాలి. అంతేకాదు ఆమెకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని చెప్పే సాక్ష్యం కూడా కావాల్సిందే. కోర్టు అడిగిన ఆధారాలు చూపించడం ద్వారా రావలసిన మెయింటెనెన్స్ ను ఈజీగా పొందవచ్చు.