Pawan Kalyan: మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక మైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు లాంటి మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచి ఏకకాలంలో మూడు సినిమాలను పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ గా ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి తన పొలిటికల్ కెరియర్ ను కూడా చాలా సక్సెస్ ఫుల్ గా మార్చుకున్నారు.
ఇక ఇప్పుడు సినిమాల మీదనే తన ఫోకస్ పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వచ్చే నెల నుంచి ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ముందుగా ఈ మూడు సినిమాలను ఫినిష్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి ఆలోచిస్తాడు అని కొంతమంది తెలియజేస్తుంటే, మరి కొంత మంది మాత్రం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఇక మీదట ఆయన సినిమాలు చేసే అవకాశాలు లేవు అంటూ వాళ్ల అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు.
ఇక నిజానికి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తను సినిమాలు చేయనని చెప్పలేదు. ఒకవేళ తను పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా సంవత్సరానికి ఒక సినిమానైతే తప్పకుండా చేస్తాడు అంటూ తన సన్నిహితులు గాని తన అభిమానులు గాని క్లారిటీ అయితే ఇస్తున్నారు. మరి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒక రకంగా చూసుకుంటే ప్రస్తుతం తను పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉండాల్సిన సమయం ఇది..
కాబట్టి చాలా వరకు ఆయన సినిమాలను తగ్గించే అవకాశం అయితే ఉంది. అలాగే ఆయన సినిమాలని చెయ్యకపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఆయన కనక సినిమాలను ఆపేస్తే హరిహర వీరమల్లు సినిమా ఆయనకి చివరి సినిమా అవుతుంది…ఇక ఇదిలా ఉంటే ఒక పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా తను పలు రకాల బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎలా తన కెరియర్ ను ప్లాన్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…