Daggubati Purandeswari: లోక్ సభ స్పీకర్ గా పురందేశ్వరి?

Daggubati Purandeswari: పురందేశ్వరి పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. సీనియర్ నాయకురాలు కూడా. పైగా బిజెపి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీకి అతిపెద్ద విజయం ఇది.

Written By: Dharma, Updated On : June 10, 2024 10:36 am

Purandeswari as Speaker of Lok Sabha

Follow us on

Daggubati Purandeswari: దగ్గుబాటి పురందేశ్వరిని కేంద్ర క్యాబినెట్లో ఎందుకు తీసుకోలేదు? విస్తరణలో ఛాన్స్ ఇస్తారా? లేకుంటే మరో పదవి అప్పగిస్తారా? ఆమె విషయంలో చంద్రబాబు ఆలోచన ఏంటి? ఎందుకు ఆమె పేరు సిఫారసు చేయలేదు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. ఆమె పేరును లోక్ సభ స్పీకర్ పదవికి పరిగణలో తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఏపీకి సముచిత స్థానం కల్పించినట్టే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురుకు మంత్రి పదవులు లభించాయి. గతంలో ఏపీకి కనీస ప్రాతినిధ్యం లేదు. కానీ ఈసారి ఏకంగా మూడు మంత్రి పదవులు కాటాయించారు. భాగస్వామ్య పక్షమైన టిడిపికి రెండు, బిజెపి కోటాలో ఒక మంత్రి పదవి దక్కింది. అయితే తెలంగాణ నుంచి బిజెపికి రెండు పదవులు దక్కాయి. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఒకటి తో సరిపెట్టారు.

Also Read: Uttarandhra: ఉత్తరాంధ్ర – తెలుగు దేశం – కేంద్రమంత్రులు

పురందేశ్వరి పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. సీనియర్ నాయకురాలు కూడా. పైగా బిజెపి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీకి అతిపెద్ద విజయం ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డిఏ హ్యాట్రిక్ కొట్టడానికి కూడా ఏపీయే కారణం. ఇప్పుడు టిడిపి అండతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగ గలదు. అందుకే ఈసారి చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యత దక్కింది. అయితే టిడిపి తో పొత్తు వెనుక పురందేశ్వరి కృషి ఉంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే ఆమె పేరును లోక్ సభ స్పీకర్ పదవికి సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Amaravati Capital : అమరావతికి సరికొత్త కళ!

ప్రస్తుతం చంద్రబాబు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తొలినాళ్లలో వారి మధ్య రాజకీయ విభేదాలు నడిచాయి. దీంతో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ పురందేశ్వరికి ఎంపీ సీట్లు ఇచ్చి ప్రోత్సహించింది. రెండుసార్లు యూపీఏ ప్రభుత్వంలో పురందేశ్వరి మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత బిజెపిలో చేరారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ పై పురందేశ్వరి పోరాడారు. ఈ క్రమంలో రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. తెలుగుదేశం పార్టీతో బిజెపికి దగ్గర చేసేందుకు పురందేశ్వరి ఎంతగానో ప్రయత్నించారు. అందులో సక్సెస్ అయ్యారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఏపీ కీలకంగా మారింది. 1996లో సైతం టిడిపి కేంద్రంలో కీలకంగా మారింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవి టిడిపికి లభించింది. అప్పుడే జిఎంసి బాలయోగి స్పీకర్ అయ్యారు. అయితే ఇప్పుడు స్పీకర్ పదవి ఏపీకి ఇవ్వాలంటే సీనియర్లు లేరు. అందుకే చంద్రబాబు పురందేశ్వరి పేరు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దలు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.