Ram Charan And NTR: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan),ఎన్టీఆర్(Junior NTR) కాంబినేషన్ లో తెరకెక్కిన #RRR చిత్రాన్ని మూవీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించిన సినిమా అది. మన టాలీవుడ్ కి మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకు మొట్టమొదటి ఆస్కార్ ని తెచ్చిపెట్టిన సినిమా అది. ఆ ఆస్కార్ అవార్డు కేవలం ఈ ఇద్దరి హీరోల వల్లనే వచ్చిందని అందరూ బలంగా నమ్ముతుంటారు. ఎందుకంటే ‘నాటు నాటు’ పాటలో వీళ్లిద్దరి డ్యాన్స్ ని చూసి ప్రపంచంలోని మూవీ లవర్స్ మొత్తం ఊగిపోయారు కాబట్టి. వీళ్ళ తరుపున చంద్రబోస్, కీరవాణి ఆస్కార్ ని అందుకున్నారు. అలాంటి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే ఎలా ఉంటుంది?, ఈసారి మన ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అనే కదా అనుకుంటాం. త్వరలోనే ఈ కాంబినేషన్ మరోసారి మన ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.
Also Read: రవితేజ ‘మాస్ జాతర’పై నీలినీడలు: మరో రొటీన్ సినిమానా? అందుకే ప్రమోషన్ పక్కన పెట్టారా?
వివరాల్లోకి వెళ్తే ‘జైలర్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, ప్రస్తుతం ‘జైలర్ 2’ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్రర్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా తో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజీ మల్టీస్టార్రర్ మూవీ ని కూడా రీసెంట్ గానే ఓకే అయినట్టు తెలుస్తుంది. ఇటీవలే హైదరాబాద్ కి వచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరి హీరోలకు ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ కథ ని వినిపించాడట. ఇద్దరికీ ఆ కథ చాలా బాగా నచ్చిందని టాక్.
#RRR చిత్రం లో లాగా ఇందులో కూడా హీరోలిద్దరిదీ పాజిటివ్ క్యారెక్టర్స్. కానీ ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంటుందట. #RRR చిత్రం మాదిరిగా స్నేహ పూర్వక వాతావరణం ఈ ఇద్దరి హీరోల మధ్య ఉండదట. ఇలా ఉంటేనే కదా అసలు మజా, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు అంటే ఇలాగే ఉండాలి, అప్పుడే ఆడియన్స్ కి కూడా చూసేందుకు ఆసక్తి కలుగుతుంది. గతం లో కృష్ణ, శోభన్ బాబు సినిమాలు కూడా ఇలాగే ఉండేవి. ఆ తర్వాత ఈ మల్టీస్టార్రర్ ట్రెండ్ కి బ్రేక్ పడింది, లేదంటే చిరంజీవి, బాలకృష్ణ మరియు వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల మల్టీస్టార్రర్ సినిమాలు కూడా వచ్చేవి ఏమో. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టార్రర్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది.