Rajinikanth Retirement: 74 ఏళ్ళ వయస్సు లో కూడా స్టార్ హీరోలతో సరిసమానంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని పాన్ ఇండియా లెవెల్ లో బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) మాత్రమే. ఇండియా లో ఎంతో మంది సూపర్ స్టార్స్ రావొచ్చు, వెళ్లొచ్చు, కానీ రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ని భవిష్యత్తులో మరొకరిని చూడలేము. అలాంటి హిస్టరీ ని క్రియేట్ చేసిన రజినీకాంత్ ఫిల్మోగ్రఫీ కి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి, శాశ్వతంగా సినీ కెరీర్ నుండి తప్పుకొని, హిమాలయాల్లో శేష జీవితాన్ని గడపాలని రజినీకాంత్ నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది రజినీకాంత్ నుండి ‘కూలీ’ అనే చిత్రం విడుదలైంది.
Also Read: రవితేజ ‘మాస్ జాతర’పై నీలినీడలు: మరో రొటీన్ సినిమానా? అందుకే ప్రమోషన్ పక్కన పెట్టారా?
ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 520 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తర్వాత ఆయన ‘జైలర్ 2’ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది. ఈ సినిమా పూర్తి అయ్యాక, కమల్ హాసన్ తో కలిసి ఆయన ఒక మల్టీస్టార్రర్ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. కథ సిద్ధమైంది,కానీ దర్శకుడు ఎవరు అనే విషయం లో నిన్న మొన్నటి వరకు చిన్నపాటి అయ్యోమయ్యం ఉండేది. మొదట్లో ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తాడని అనుకున్నారు, కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత డ్యూడ్ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరిగింది. దీనికి ప్రదీప్ స్పందిస్తూ తన ఫోకస్ మొత్తం ఇప్పుడు నటన పైనే ఉంది, దర్శకత్వం వహించే ఛాన్స్ లేదని తేల్చి చెప్పాడు.
ఇప్పుడు రీసెంట్ గా ఈ కాంబినేషన్ ని తెరకెక్కించేందుకు ‘జైలర్ 2’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ముందుకు వచ్చినట్టు కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా తర్వాతే రజినీకాంత్ తన కెరీర్ కి ముగింపు పలకబోతున్నాడని టాక్. రజినీకాంత్ సినీ కెరీర్ కమల్ హాసన్ తోనే మొదలైంది. అప్పట్లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. కమల్ హాసన్ హీరో గా నటిస్తే, అందులో రజినీకాంత్ విలన్ గా నటించేవాడు. ఇప్పుడు అదే కమల్ హాసన్ తో కలిసి మల్టీస్టార్రర్ చిత్రం చేసి తన సినీ కెరీర్ కి టాటా చెప్పే ప్రయత్నం రజినీకాంత్ చేస్తున్నాడని టాక్. ఇదే కనుక నిజమైతే అభిమానుల గుండెలు బద్దలు అయిపోతాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.