Homeఎంటర్టైన్మెంట్Jabardasth Comedian: హీరోగా మారిన మరో జబర్దస్త్ కమెడియన్... సుడిగాలి సుధీర్ కి పోటీనా?

Jabardasth Comedian: హీరోగా మారిన మరో జబర్దస్త్ కమెడియన్… సుడిగాలి సుధీర్ కి పోటీనా?

Jabardasth Comedian: జబర్దస్త్ వేదికగా అనేక మంది స్టార్స్ అయ్యారు. కొందరు హీరోలుగా రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్ హిట్ కూడా కొట్టాడు. అతనికి పోటీ ఇస్తూ మరో జబర్దస్త్ కమెడియన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలైంది. కొందరు కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా వ్యవహరించారు. రోజా, నాగబాబు జడ్జెస్ గా ఉన్నారు. అనసూయ యాంకర్ గా వ్యవహరించింది. జబర్దస్త్ ఊహకు మించిన సక్సెస్ కొట్టింది. యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ స్టార్స్ అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీనుతో పాటు పలువురు నటులుగా సెటిల్ అయ్యారు.

సుడిగాలి సుధీర్ అయితే… హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతడు నటించిన గాలోడు మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. గెటప్ శ్రీను సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతడు ప్రధాన పాత్రలో రాజు యాదవ్ తెరకెక్కుతుంది. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

అతడు ఎవరో కాదు ముక్కు అవినాష్. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ముక్కు అవినాష్ ఒకడు. కెవ్వు కార్తీక్-ముక్కు అవినాష్ లు టీమ్ లీడర్స్ గా స్కిట్స్ చేసేవాళ్ళు. తనకంటూ ఒక కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకుని సక్సెస్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 4లో అవినాష్ కి అవకాశం వచ్చింది. దాంతో అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఆ షోకి వెళ్ళాడు. జబర్దస్త్ నిర్మాతలకు పది లక్షలు చెల్లించినట్లు అవినాష్ తెలియజేశాడు.

కాగా అవినాష్ హీరోగా ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అతడు స్వయంగా ధృవీకరించాడు. ఆయన మాట్లాడుతూ… నేను హీరోగా పిలిపించుకోవడానికి ఇష్టపడను. నటుడు అనే గుర్తింపే బాగుంటుంది. ఓ చిత్రంలో నేను లీడ్ రోల్ చేయబోతున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలవుతుంది అన్నారు. ఈ క్రమంలో ముక్కు అవినాష్ సుడిగాలి సుధీర్ కి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. మరి హీరోగా అవినాష్ ఈ స్థాయిలో విజయం సాధిస్తాడో చూడాలి…

Exit mobile version