Maruthi Dzire: కొత్త Dzire ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు.. ధర కూడా తక్కువే..

కొత్త డిజైర్ దాదాపు స్విప్ట్ ను పోలి ఉంటుంది. కానీ ఇందులో సెడాన్ కు పెద్ద గ్రిల్, క్లామ్ షెల్ బానెట్,ప్రత్యేక కట్, క్రీజ్ తో కూడిన కొత్త బంపర్, కొత్త 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Written By: Srinivas, Updated On : April 3, 2024 10:46 am

Maruthi dezire

Follow us on

Maruthi Dzire: Maruthi dezireమారుతి కార్లను చాలా మంది లైక్ చేస్తారు. వినియోగదారులను ఇంప్రెస్ చేసే విధంగా ఫీచర్స్, మైలేజ్, ధర ఉంటాయని చాలా మంది భావన. దీంతో మారుతి నుంచి ఏ మోడల్ వచ్చినా కొనేందుకు ఆసక్తి చూపుతారు. కంపెనీ సైతం కస్టమర్స్ న దృష్టిలో ఉంచుకొని కార్లను ఉత్పత్తి చేస్తుంది. మారుతి నుంచి రిలీజైన వాటిలో వ్యాగన్ ఆర్, స్విప్ట్ సంచలన మోడళ్లుగా నిలిచాయి. వీటితో పాటు డిజైర్ కూడా ఎక్కువ సేల్స్ నమోదు చేసింది. అయితే లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు కొత్త తరంగా డిజైర్ ను తీసుకొస్తారు. ఈ క్రమంలో దీనిలో కొన్ని మార్పుల చేశారు. ప్రీమియం ఫీచర్స్ తో రానున్న దీని వివరాల్లోకి వెళితే..

మారుతి కొత్త తరం డిజైర్ ఫీచర్స్ ఆకట్టుకునే లెవల్లో ఉన్నాయి. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్, సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆటోమేటిక్ ఏసీ, కీ లెస్ ఎంట్రీ ఉన్నాయి. సేప్టీ లోనూ దీనిని కొత్తతరహాలో మార్చారు. దీని వెనుక 360 డిగ్రీ కెమెరా, ఫాక్స్ వుడ్ టచ్ తో పాటు లైట్ వెయిట్ డ్యూయెల్ టోన్, పెయింట్ స్క్రీన్ ఉన్నాయి.

కొత్త డిజైర్ దాదాపు స్విప్ట్ ను పోలి ఉంటుంది. కానీ ఇందులో సెడాన్ కు పెద్ద గ్రిల్, క్లామ్ షెల్ బానెట్,ప్రత్యేక కట్, క్రీజ్ తో కూడిన కొత్త బంపర్, కొత్త 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఆధునీకరించిన టెయిల్ లైట్స్ ఆకర్షిస్తాయి. ఇంజిన్ విషయానికొస్తే డిజైర్ లో 1.2 లీటర్ 3 సిలిండర్ జడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 82 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కు మద్దతు ఇచ్చే ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ని పొందుతుంది.

ఇప్పటికే ప్రొడక్షన్ పూర్తయిన డిజైర్ ను పరీక్షించడం మొదలు పెట్టారు. ఈ సమయంలో దీని ఫీచర్స్ బయటకు వచ్చాయి. కొత్త డిజైర్ ను రూ.6.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. మారుతి డిజైర్ ఎక్కువగా సేల్స్ నమోదు చేసుకున్న నేపథ్యంలో కొత్త కారును కూడా ఆదరిస్తారని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్ంలో త్వరలో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నారు.