America: అమెరికాలో అతి స్వేచ్ఛ.. ప్రజల విపరీత ధోరణి! అసలు కారణమేంటి?

స్వేచ్ఛ ఉందన్న సాకుతో అమెరికాలు ప్రజలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వస్త్రధారణ నుంచి వివాహాలు, వివాహేతర సంబంధాలు ఇలా అన్నింటికీ స్వేచ్ఛ అనే కారణం చెబుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : April 3, 2024 10:28 am

America

Follow us on

America: స్వేచ్ఛ.. ఇది అందరికీ అవసరం. స్వేచ్ఛ కోసమే అనేక పోరాటాలు జరిగాయి. వలస రాజ్యాల నుంచి స్వేచ్ఛ కావాలని అనేక దేశాలు స్వాతంత్య్ర పోరాటం చేశాయి. స్వాతంత్య్రం సాధించాయి. స్వేచ్ఛగా పరిపాలన సాగించుకుంటున్నాయి. అయితే అగ్రరాజ్యాం అమెరికా కూడా ప్రజాస్వామ్య దేశమే. అయితే ఇక్కడి అతి స్వేచ్ఛతో అక్కడి ప్రజల విపరీత ధోరణికి కారణమవుతోంది.

స్వేచ్ఛ సాకుతో..
స్వేచ్ఛ ఉందన్న సాకుతో అమెరికాలు ప్రజలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వస్త్రధారణ నుంచి వివాహాలు, వివాహేతర సంబంధాలు ఇలా అన్నింటికీ స్వేచ్ఛ అనే కారణం చెబుతున్నారు. అతి స్వేచ్ఛ కారణంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గన్‌ కల్చర్‌ పెరుగుతోంది. ఇష్టానుసారం కాల్పులు, చంపుకోవడాలు జరుగుతున్నాయి. ఏమైనా అంటే స్వేచ్ఛ అనే సాకు చూపుతున్నారు.

దేశ అంతర్గత వ్యవహారాల్లో..
తాజాగా స్వేచ్ఛ ఉందికదా అని అమెరికన్లు దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ తలదూర్చడం మొదలు పెట్టారు. ఇది ఆదేశ భద్రతకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. హమాస్‌పై దాడికి సహకరిస్తోంది. దీనిని మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ వ్యతిరేకత నిరసనల వరకు వెళ్లింది. అమెరికా తీరును నిరసిస్తూ అక్కడి ప్రజలు ఆందోళన మొదులు పెట్టారు.

ఉగ్రవాద దేశానికి మద్దతు..
ఇదిలా ఉంటే.. అమెరికా, ఇజ్రయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న అమెరికన్లు.. ఉగ్రవాద దేశం పాలస్తీనాలోని హమాస్‌కు మద్దతు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దేశంపై ఉగ్రదాడులు జరిగినపుపడు ఆందోళనకు గురయ్యే అక్కడి ప్రజలు అమెరికా ఉగ్రవాద సంస్థపై దాడులను వ్యతిరేకించడం గమనార్హం. స్వేచ్ఛ ఉంది కదా అని అంతర్గత భద్రత వ్యవహారాలను వ్యతిరేకించడం విమర్శలకు తావిస్తోంది.

భయమే కారణమా..
అమెరికా ప్రజలు భయంతోనే ఆందోళన చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర దేశాల యుద్ధాన్ని ప్రోత్సహించడం ద్వారా అమెరికా ఇతర దేశాలకు శత్రువుగా మారుతుందని, తద్వారా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంటుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలు అమెరికా తీరుపై నిరసనలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.