spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Extra Jabardasth: స్కిట్ కోసం నాలుక కట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్... ఇదేం ట్విస్ట్ బాబోయ్!

Extra Jabardasth: స్కిట్ కోసం నాలుక కట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్… ఇదేం ట్విస్ట్ బాబోయ్!

Extra Jabardasth: బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. జబర్దస్త్ కి పోటీగా ఎన్ని కామెడీ షోలు వచ్చినా దాని ముందు నిలబడలేక పోయాయి. కొన్నేళ్లుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. షో రక్తి కట్టించడానికి కమెడియన్లు నానా తంటాలు పడుతుంటారు. టీఆర్పీ కోసం విచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ కమెడియన్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. స్కిట్ కోసం ఏకంగా నాలుక కట్ చేసుకున్నాడు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికగా ఆటో రాంప్రసాద్ టీం లో ఈ పరిణామం చోటుచేసుకుంది. సుడిగాలి సుధీర్ టీం లో ఆర్టిస్ట్ గా చేసిన రాంప్రసాద్ ఇప్పుడు టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు.గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ సినిమాలతో బిజీ అయ్యారు. దానితో రాం ప్రసాద్.. బాబు, సన్నీ లతో కలిసి స్కిట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రాంప్రసాద్ మాది మంచిపురం అండి .. మా ఊళ్ళో వాళ్ళందరూ మంచోళ్ళు అని అంటాడు. ఇక సన్నీ వైపు చూపిస్తూ .. వాడు నా తమ్ముడు అంటాడు.

వీడు చాలా మంచివాడు అని రాంప్రసాద్ అంటాడు. దీంతో పక్కనే ఉన్న బాబు ఎందుకు అంత మంచివాడు అయ్యాడని అడుగుతాడు. ఈ స్కిట్ కోసం వాడు చాలా పెద్ద త్యాగం చేశాడని చెప్పాడు. ఆ త్యాగం ఏంటో అని బాబు అడగ్గా .. ఈ స్కిట్ కోసం సన్నీ నాలుక కట్ చేసుకున్నాడని రాంప్రసాద్ చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ స్కిట్ లో వీడికి మాటలు లేవని చెప్పాడు. ఇక బాబు చూపిస్తూ వీడు ఎలా ఉన్నాడు తమ్ముడు అని… సన్నీని రాంప్రసాద్ అడుగుతాడు.

బాబును చూసి మీసాలు మెలేస్తాడు సన్నీ. అచ్చం నువ్వు హీరోలా ఉన్నావని అంటున్నాడు అని రాంప్రసాద్ చెప్తాడు. కాగా ఇదంతా స్కిట్ లో భాగమే నిజంగా సన్నీ నాలుక కోసుకోలేదు. కేవలం వినోదం కోసం మాత్రమే ఇలా చేశారు. అయితే జబర్దస్త్ లో మునుపటిలా కామెడీ పండటం లేదు. స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ ని వీడడంతో వైభవం కోల్పోయింది. ఏదో అలా జూనియర్ కమెడియన్స్ తో షో నడిపించేస్తున్నారు.

 

Extra Jabardasth | 9th February 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan, Ramprasad

Exit mobile version