https://oktelugu.com/

Samantha- Naga Chaitanya: చైతు – స‌మంత కాపురం గుట్టు చెప్పిన సీనియ‌ర్ హీరో.. ఉద‌యమే సమంత ఏం చేసేది అంటే ?

Samantha- Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోవడం అనేది అక్కినేని ఫ్యాన్స్ కి నేటికీ షాకే. నిజానికి అక్కినేని కోడలుగా సమంత ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. అయితే సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్స్ నుండి తన పేరుకు ముందు ఉన్న ‘అక్కినేని’ పేరును తొలగించే వరకూ చైతు – సామ్ విడిపోతున్నారని ప్రపంచానికి తెలియదు. అసలు చైతు – సామ్ మధ్య ఎన్నడూ గొడవ కూడా జరిగినట్టు వార్తలు రాలేదు. మరి ఎందుకు […]

Written By:
  • Shiva
  • , Updated On : July 17, 2022 / 01:31 PM IST
    Follow us on

    Samantha- Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోవడం అనేది అక్కినేని ఫ్యాన్స్ కి నేటికీ షాకే. నిజానికి అక్కినేని కోడలుగా సమంత ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. అయితే సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్స్ నుండి తన పేరుకు ముందు ఉన్న ‘అక్కినేని’ పేరును తొలగించే వరకూ చైతు – సామ్ విడిపోతున్నారని ప్రపంచానికి తెలియదు. అసలు చైతు – సామ్ మధ్య ఎన్నడూ గొడవ కూడా జరిగినట్టు వార్తలు రాలేదు.

    Samantha- Naga Chaitanya

    మరి ఎందుకు ఈ క్రేజీ కపుల్ విడిపోయారు ?, మరేదైనా కారణం ఉందా ? అని నెటిజన్లు ఇప్పటికీ ఆరా తీస్తూనే ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్‌ అనంతరం సమంతని నాగచైతన్య 2017లో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక పెళ్లైన వెంటనే తన సోషల్‌ మీడియా అకౌంట్స్ లో సమంత తన పేరు పక్కన ‘అక్కినేని’ అనే పేరును యాడ్ చేసుకుని తెగ మురిసిపోయింది.

    Also Read: The Warrior Collections: ‘ది వారియర్’ 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా ?

    తెలుగింటి కోడలుగా ప్రశంసలు అందుకుంది. పైగా అప్పటి నుంచి సమంత సినిమాల వేగం పెంచడం, దానికి తగ్గట్లుగానే ఆమె సక్సెస్ రేటు కూడా పెరగడంతో సామ్ కి తిరుగులేకుండా పోయింది. కానీ సడెన్‌ గా చైతు – సామ్ తమ దాంపత్య జీవితానికి బ్రేకప్ చెప్పారు. అయితే, వీరి విడాకుల పై తాజాగా సీనియర్ నటుడు మురళీమోహన్ ఓపెన్ అయ్యారు.

    ముర‌ళీ మోహ‌న్‌ ఇంట్లోనే సామ్ – చైతు కాపురం పెట్టారు. ముర‌ళీ మోహ‌న్‌ ఇంటిలో మూడు ప్లాట్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాట్స్‌ లో ముర‌ళీ మోహ‌న్‌, ఆయ‌న కొడుకు, ఆయ‌న తమ్ముడు ఉంటున్నారు. నాగార్జున, ముర‌ళీమోహ‌న్‌ తో ‘చైతుకి ఏవీ నచ్చ‌వు. మీ ప్లాట్స్ బాగున్నాయ‌ని, కావాలి అంటున్నాడు’ అనగానే ముర‌ళీమోహ‌న్ తన త‌న‌యుడి ఫ్లాట్‌ను చైతుకు ఇచ్చారు.

    Samantha- Naga Chaitanya

    చైతు – స‌మంత ఆ ప్లాట్ లో ఉన్న‌న్ని రోజులు చాలా ఆప్యాయ‌త‌తో ఉన్నారట. ప్ర‌తి రోజు ఉద‌యం లేచి స‌మంత జిమ్ చేసేద‌ని, చైతు – స‌మంత క‌లిసి బ‌య‌ట వాకింగ్ ప్లేస్‌లో కొద్దిసేపు న‌డిచేవార‌ని, చ‌క్క‌గా మాట్లాడుకుంటూ ఎంతో అన్యోన్య‌త‌తో ఉండేవార‌ని ముర‌ళీమోహ‌న్ చెప్పుకొచ్చారు. అసలు సామ్ కి – చైతుకి మధ్య విబేధాలు ఉన్న‌ట్టు తాను ఎప్పుడూ వినలేదు అని, చూడ‌లేద‌ని ముర‌ళీమోహ‌న్ చెప్పుకొచ్చారు.

    ఒకవేళ, సామ్ – చైతు విడిపోతున్న విష‌యం నాకు ముందు తెలిసి ఉండి ఉంటే.. నాగార్జున‌తో నేను మాట్లాడి.. మేము వారితో మాట్లాడ‌డానికి ఛాన్స్ ఉండేది. కానీ మాకు విడిపోయాకే విషయం తెలిసింది. అందుకే, మేము ఏమి చేయలేకపోయాం’ అంటూ ముర‌ళీమోహ‌న్ చెప్పుకొచ్చారు.

    Also Read:Happy Birthday Collections: ‘హ్యాపీ బర్త్ డే’ 10 డేస్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది ? ఇంకెంత రావాలి ?

    Tags