ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్మలమ్మ ఉద్దీపన ప్యాకేజీ.  

దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. మార్చిలో కేంద్రం లాక్డౌన్ విధించి క్రమంగా సడలింపులిస్తూ తాజాగా పూర్వస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు. Also Read: రాజకీయం.. రణం.. అమాయకుల ప్రాణాలు ఖతం కరోనా ఎఫెక్టుతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోవడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా ఉద్యోగాల సృష్టి […]

Written By: NARESH, Updated On : November 12, 2020 5:34 pm
Follow us on

దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. మార్చిలో కేంద్రం లాక్డౌన్ విధించి క్రమంగా సడలింపులిస్తూ తాజాగా పూర్వస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు.

Also Read: రాజకీయం.. రణం.. అమాయకుల ప్రాణాలు ఖతం

కరోనా ఎఫెక్టుతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోవడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా ఉద్యోగాల సృష్టి కోసం ‘ఆత్మనిర్భర్ భారత్ 3.0’ పథకాన్ని తీసుకొచ్చింది. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రకటించారు.

ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద కొత్త ఉద్యోగులను తీసుకొనే సంస్థలకు పీఎఫ్ కంట్రీబ్యూషన్లో కేంద్రం సబ్సీడీ ఇవ్వనుంది. వెయ్యిలోపు ఉద్యోగులుండే సంస్థలకు ఉద్యోగుల వాటా.. సంస్థల వాటా పీఎఫ్ లో మొత్తం 24శాతం కేంద్రం భరించనుంది. వెయ్యి కంటే ఎక్కువ ఉద్యోగులు ఉండే సంస్థ మాత్రం ఉద్యోగుల పీఎఫ్ వాటాను కేంద్రం భరించనుంది.

Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కేటీఆర్‌‌ దూకుడు

పీఎం ఆవాస్ కింద 18వేల కోట్లు.. కొత్తగా 12లక్షల ఇళ్ నిర్మాణం.. 78లక్షల ఉద్యోగాల కల్పన.. గృహ కొనుగోలుదారులకు ఆదాయపు పన్నులో మినహాయింపు.. ఎరువుల సబ్సీడీకి 65వేల కోట్లు.. పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజనకు 10వేల కోట్లు.. ఎగ్జిమ్ బ్యాంకులు 3వేల కోట్లు.. దేశీయ పరికరాల తయారీకి ప్రోత్సాహాకాల కోసం 10,200 కోట్లను ఆత్మనిర్భర్ భారత్ 3.0లో ఖర్చు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కార్ రెండు భారీ ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. అయితే వీటితో పేద, సామాన్యులకు ఒరిగింది ఏమిలేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.తాజాగా కేంద్రం ప్రకటించిన  మూడో ప్యాకేజీ అయిన కిందిస్థాయి వరకు చేరుతుందో లేదో వేచిచూడాల్సిందే..!