Anirudh: టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలకు కొదవలేదు.. కానీ గత కొద్ది కాలంగా తెలుగు సినిమాలలో మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. యువ సంచలనంగా ముందుకు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఒకే రకమైన మ్యూజిక్ అందిస్తున్నట్లు పలు రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకి తమన్ చేసిన దసరా మూవీ మరియు చేస్తున్న గుంటూరు కారం మూవీ రెండిటికీ బ్యాక్ గ్రౌండ్ ఒకటే అని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది.
మిగిలిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి కూడా తెలుగు ఇండస్ట్రీలో ఇదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం తమిళ్ మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రానికి ఎక్సలెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి టాప్ నాచ్ గా చిత్రాలను నిలుపుతున్న అనిరుద్ ప్రస్తుతం తమిళ్ సినీ ఇండస్ట్రీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
అతని పనికి ఇంప్రెస్ అవుతున్న తెలుగు స్టార్ హీరోస్ తమన్ మూవీస్ కి మ్యూజిక్ కంపోజర్ గా అనిరుద్ధానం సైన్ చేయమని మరోపక్క నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నారు. అనిరుద్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి,నాని జెర్సీ మూవీ లకు సంగీతం అందించారు. కమల్ హాసన్ రీయంట్రీ ఇచ్చిన విక్రమ్ చిత్రం మూవీకి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ తో పాటుగా ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ దేవర చిత్రానికి కూడా అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
రామ్ చరణ్ , శంకర్ కాంబోలో వస్తున్న చరణ్ 16 చిత్రానికి కూడా అనిరుద్ మ్యూజిక్ అందించే అవకాశం ఉంది. ఇప్పటికైనా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ మేలుకొని ఒకేలాంటి సీక్వెన్స్ మ్యూజిక్ కాకుండా వినూత్నంగా ట్రై చేయకపోతే రాబోయే కాలంలో టాలీవుడ్ లో ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్ హవా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని సినీ విశ్లేషకులు అంచనా. హేషమ్ అబ్దుల్ వహాబ్,గోపి సుందర్,జివి ప్రకాష్.. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్ మంచి క్రేజీ ప్రాజెక్ట్ తమ ఖాతాలో వేసుకుంటున్నారు. మరి ఇప్పుడు దూసుకు వస్తున్న అనిరుద్.. తుఫాను వేగాన్ని తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తట్టుకోగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది.