Animal Collections : బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన యానిమల్… 13 రోజుల్లో ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే?

ఇవేమీ ప్రేక్షకులను ఆపలేకపోయాయి. యానిమల్ వసూళ్లు అంతకంతకు పెరుగుతూ పోయాయి. రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద యానిమల్ నిలకడగా వసూళ్లు రాబట్టింది.

Written By: NARESH, Updated On : December 14, 2023 10:29 am
Follow us on

Animal Collections : యానిమల్ 2023కి గాను అతిపెద్ద గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాల తర్వాత భారీ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు సాధించడం సామాన్యమైన విషయం కాదు. యానిమల్ ఏకంగా బాహుబలి 1 రికార్డు బ్రేక్ చేసింది. కేవలం రూ. 200 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం రెట్టింపు లాభాలు రాబట్టింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్ హీరోగా నటించాడు.

యానిమల్ మూవీపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. పార్లమెంట్ సాక్షిగా ఈ చిత్రాన్ని ప్రజాప్రతినిధులు తప్పుబట్టారు. ఓ వర్గం ఆడియన్స్, చిత్ర వర్గాలు, ఫిలిం క్రిటిక్స్ యానిమల్ చెత్త సినిమా అని అభివర్ణించారు. ఇవేమీ ప్రేక్షకులను ఆపలేకపోయాయి. యానిమల్ వసూళ్లు అంతకంతకు పెరుగుతూ పోయాయి. రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద యానిమల్ నిలకడగా వసూళ్లు రాబట్టింది.

13వ రోజు యానిమల్ ఇండియాలో యానిమల్ రూ. 10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్ లో యానిమల్ చిత్రానికి విపరీతమైన ఆదరణ దక్కింది. యానిమల్ మూవీ 13 రోజులకు $ 25.6 మిలియన్ వసూళ్లు రాబట్టింది. ఇండియన్ కరెన్సీలో 213 కోట్లు. వరల్డ్ వైడ్ యానిమల్ మూవీ 467.5 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 774 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

బాహుబలి 1 పేరిట ఉన్న రూ. 418 కోట్ల నెట్ వసూళ్లు టార్గెట్ ని యానిమల్ బ్రేక్ చేసింది. కేవలం రూ. 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన యానిమల్ రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా యానిమల్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. రన్బీర్ కపూర్ కి జంటగా రష్మిక మందాన నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేశారు.