IND vs SA : సౌతాఫ్రికా తో ఆడే మూడో టి 20 మ్యాచ్ లో ఆ ముగ్గురు ఔట్..

ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ఇంతకు ముందు ఆస్ట్రేలియా మీద జరిగిన టి20 మ్యాచ్ లో సెంచరీ చేసి తన అద్భుతమైన ఫామ్ ని నిరూపించుకున్నాడు.

Written By: NARESH, Updated On : December 14, 2023 10:40 am
Follow us on

IND vs SA : ప్రస్తుతం ఇండియన్ టీం సౌతాఫ్రికా తో టి20 సిరీస్ ఆడుతుంది. ఇందులో మొదటి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా రెండో మ్యాచ్ లో కూడా వర్షం కొంత మేరకు అంతరాయం కలిగించినప్పటికీ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా రెండో మ్యాచ్ లో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లోఇండియన్ టీమ్ లో కీలక మార్పులు చేయడం వల్ల ఇండియాకి ఓటమి అనేది తప్పలేదు అని సీనియర్ క్రికెటర్లు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, రుతు రాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్,ఇషాన్ కిషన్ లాంటి స్టార్ ప్లేయర్లను పక్కన పెట్టి మిగతా ప్లేయర్లతో మ్యాచ్ ఆడించారు. ఫలితంగా ఈ మ్యాచ్ లో ఆ ప్లేయర్లు ఏ మేరకు సత్తా చాటకపోవడంతో ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది.ఇక ముఖ్యంగా ఓపెనర్ ప్లేయర్లు అయిన యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ ఇద్దరూ కూడా డక్ అవుట్ అవ్వడంతో టీమిండియా భారీ కష్టాల్లో పడింది. ముఖ్యంగా రుతు రాజ్ గైక్వాడ్ ని పక్కనపెట్టడం వల్ల ఇద్దరు డక్ అవుట్ అవ్వడంతో ఆ భారం మొత్తం మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు మోయాల్సి వచ్చింది.

ఇక ఇషాన్ కిషన్ ప్లేస్ లో జితేష్ శర్మని తీసుకున్నారు.జితేష్ శర్మ పెద్దగా పర్ఫామెన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. అలాగే రవి బిష్ణోయ్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ని ఆడించారు. కుల్దీప్ యాదవ్ కూడా పెద్దగా పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేదు.ఇక దాంతో సెకండ్ మ్యాచ్ కి టీం సెలెక్షన్ పైన విపరీతమైన కామెంట్లైతే వస్తున్నాయి. దానికి చెక్ పెట్టడానికి టీంలో కీలకమైన మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లని అవుట్ చేసి మరో ముగ్గురు ప్లేయర్లని రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తుంది తిలక్ వర్మాన్ని పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్ ని ఆడించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే జితేష్ శర్మ ప్లేస్ లో ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ లేదా యశస్వి జైశ్వాల్ ఇద్దరిలో ఎవరునో ఒక్కరిని పక్కనపెట్టి వాళ్ల ప్లేస్ లో రుతురాజ్ గైక్వాడ్ ని తీసుకునే అవకాశం అయితే ఉంది.

ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ఇంతకు ముందు ఆస్ట్రేలియా మీద జరిగిన టి20 మ్యాచ్ లో సెంచరీ చేసి తన అద్భుతమైన ఫామ్ ని నిరూపించుకున్నాడు. ఇలాంటి సమయంలో అతన్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. నిజానికి ఈ మ్యాచ్ లో గెలుపు ఓటములు పక్కన పెడితే ప్లేయర్లకు ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశ్యం తో ఈ సీరీస్ లో అందరి ప్లేయర్లను పరిక్షిస్తున్నట్టు గా తెలుస్తుంది…చూడాలి మరి మూడో మ్యాచ్ కి ఏ ప్లేయర్లు బరిలోకి దిగుతారో…