Prabhas Spirit First Look : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రం పై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలన్నిటికంటే ఈ చిత్రం మీదనే అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం పిచ్చెక్కిపోతున్నారు. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ కంటే, ‘స్పిరిట్’ మీదనే ఆడియన్స్ కి ఎక్కువ అంచనాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ నిన్న అర్థ రాత్రి 12 గంటలకు విడుదల చేసిన ‘స్పిరిట్’ మూవీ ఫస్ట్ లుక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ని అభిమానులు ఇంత కాలం ఎలా చూడాలని అనుకున్నారో, సందీప్ అలా చూపించాడంటూ సోషల్ మీడియా లో అభిమానులు మురిసిపోయారు.
అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పై విమర్శలు కూడా భారీగానే వస్తున్నాయి. సందీప్ వంగ తన హీరోలను అర్జున్ రెడ్డి, యానిమల్ లో ఎలా అయితే చూపించాడా, స్పిరిట్ చిత్రం లో కూడా అలాగే చూపించాడు, బాగా రొటీన్ అనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ వంగ హీరో అంటే చేతిలో మందు బాటిల్, చొక్కా విప్పేసి నోట్లో సిగరెట్ కాలుస్తూ తిరగడం, ఇదేనా?, ఇప్పటికే అది రెండు సినిమాల్లో చూసాము , మళ్లీ అదే చూపిస్తాను అంటే ఆడియన్స్ కి చిరాకు కలిగే అవకాశాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా సందీప్ వంగ కి ఒక సూపర్ స్టార్ తో పని చేయడం ఇదే తొలిసారి. స్టార్స్ తో చేసేటప్పుడు కొన్ని హద్దులు కచ్చితంగా ఉంటాయి, వాటిని అధిగమించి చేస్తే తెలుగు ఆడియన్స్ సహించరు.
యానిమల్ చిత్రం లో హీరో బట్టలు విప్పేసి, నగ్నంగా ఒక సన్నివేశం లో తిరుగుతాడు. ‘స్పిరిట్’ లో కూడా ప్రభాస్ తో జైలు లోని ఒక సన్నివేశం లో ఇలాగే నగ్నంగా చూపిస్తాడట డైరెక్టర్ సందీప్ వంగ. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో ఇలాంటి సన్నివేశాలు అసలు వర్కౌట్ అవుతాయా?, నార్త్ ఇండియా లో వర్కౌట్ అవ్వుద్దేమో కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్కౌట్ అవ్వదు అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాని ఈ ఏడాది లోనే పూర్తి చేసి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట సందీప్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసిన ఆయన, త్వరలోనే మెక్సికో కే వెళ్లి మూడవ షెడ్యూల్ ని మొదలు పెడతారట. నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ షెడ్యూల్ జరగనుంది అట.