Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi pan India movie: అనిల్ రావిపూడి పాన్ ఇండియా సినిమా ఎందుకు చేయడం...

Anil Ravipudi pan India movie: అనిల్ రావిపూడి పాన్ ఇండియా సినిమా ఎందుకు చేయడం లేదు…ఏదైనా ప్రాబ్లమా..?

Anil Ravipudi pan India movie: ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా మారి ప్రస్తుతం కింగ్ ఆఫ్ ఎంటర్ టైనర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… కమర్షియల్ సినిమాలను తీయడంలో తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నాడు… తీసిన ప్రతి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపాడు. ప్రస్తుతం ప్రతి ఒక్క స్టార్ హీరో అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఆయన ఏ రేంజ్ లో తన మార్కెట్ ని మనం విస్తరించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమవుతుంది. ఎందుకని ఆయన పాన్ ఇండియాలో సినిమాలు చేయడం లేదు. పాన్ ఇండియా సినిమా చేస్తే ఆడవని ముందే తను డిసైడ్ అయిపోతున్నాడా? లేదంటే పాన్ ఇండియా సినిమాకి సపరేట్ బడ్జెట్ కావాలని భావిస్తున్నాడా?

పాన్ ఇండియా సినిమాలు మనం చేయలేమని వెనకాడుతున్నాడా? ఎందుకు పాన్ ఇండియా సబ్జెక్ట్ లను డీల్ చేయడం లేదు అంటు కొంతమంది ప్రేక్షకులు సైకిల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తన కామెడీలో ఒక ప్యూరిటీ ఉంటుందని చాలా మంది చెబుతారు.

Also Read: ‘సలార్ 2’ కథ మామూలుగా లేదట… ప్రభాస్ ను అలా చూస్తే ప్రేక్షకులు తట్టుకుంటారా..?

ఇక మరి కొంతమంది మాత్రం అనిల్ రావిపూడిది క్రింజ్ కామెడీ అని కామెంట్స్ చేస్తుంటారు. ఆయన సినిమాలో కామెడీకి నవ్వే రాదు. కానీ కొందరు జనాలు మాత్రం దానికి విపరీతంగా నవ్వుతూ ఉంటారు. ఎందుకో ఏమో అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సైతం ఫ్యూచర్ లో పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తారట.

ప్రస్తుతం తను తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవ్వాలని లిమిటెడ్ బడ్జెట్ తో వచ్చి ప్రొడ్యూసర్ ను లాభాల బాట పట్టించడమే తన గోల్ గా చెబుతున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరంజీవితో ఈ సంవత్సరం సంక్రాంతి కి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. చిరంజీవి కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version