https://oktelugu.com/

Sreemukhi: కొత్త లుక్ లో కేక పెట్టిస్తున్న యాంకర్ శ్రీముఖి .. వైరల్ గా మారిన లేటెస్ట్ ఫోటోలు

గత ఏడాది భోళా శంకర్ సినిమాలో చిరంజీవి తో కలిసి రొమాన్స్ చేసింది. ప్రస్తుతం పలు షో లు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ బిగ్ బాస్ బ్యూటీ, గ్లామర్ షోతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 22, 2024 / 05:39 PM IST

    Sreemukhi

    Follow us on

    Sreemukhi: శ్రీముఖి బుల్లితెర పై స్టార్ యాంకర్ గా ఎదిగింది. చలాకి మాటలు, కొంటె చూపులతో, గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. ఈటీవీ లో ప్రసారమైన పటాస్ షో తో క్రేజ్ సంపాదించింది శ్రీముఖి. పటాస్ ద్వారా బుల్లితెర రాములమ్మ గా శ్రీముఖి పాప్యులర్ అయ్యింది. ఆ తర్వాత జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీముఖి హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. నాని హీరోగా వచ్చిన జెంటిల్ మ్యాన్ లో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

    గత ఏడాది భోళా శంకర్ సినిమాలో చిరంజీవి తో కలిసి రొమాన్స్ చేసింది. ప్రస్తుతం పలు షో లు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ బిగ్ బాస్ బ్యూటీ, గ్లామర్ షోతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తుంది. తన అందంతో కిరాక్ పుట్టిస్తుంది. గతంతో పోల్చితే శ్రీముఖి కొంచెం సన్నగా, నాజూగ్గా తయారైంది. దాంతో ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు చేస్తూ పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

    ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ షో కి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సూపర్ సింగర్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీ ముఖి అందంగా ముస్తాబయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక మా టీవీ లో శ్రీముఖి చేస్తున్న ఆది వారం విత్ స్టార్ మా పరివారం షో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది టాప్ టీఆర్పీ తో దూసుకుపోతోంది. సినిమాలు, షోలు, ఈవెంట్స్ చేస్తూ శ్రీముఖి బిజీ గా ఉంటుంది.

    చాలా కాలంగా శ్రీముఖి పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వాటికి చెక్ పెడుతూ .. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని శ్రీముఖి వెల్లడించింది. ఇంట్లో పేరెంట్స్ నుంచి తనకు పెళ్లి పై ఎటువంటి ప్రెషర్ లేదని .. ప్రస్తుతం షో లతో బిజీగా ఉన్నాను. పెళ్లికి ఇంకా టైం ఉందని శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది.