https://oktelugu.com/

Anchor Rashmi : సుఖం కోసం వావి వరసలు లేని సె***… యాంకర్ రష్మీ గౌతమ్ మైండ్ బ్లోయింగ్ పోస్ట్

విచ్చలవిడి శృంగారం అనే భావన కలిగించే ఒక బొమ్మను ఆమె షేర్ చేశారు. అలాగే ఓ ఘాటు కామెంట్ జోడించారు. ఈ రోజుల్లో డేటింగ్, లవ్ అంటే విచ్చలవిడి శృంగారం. శారీరక సుఖం కోసం వావి వరసలు మరచి శృంగారం చేస్తున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 30, 2023 / 12:13 PM IST

    Rashmi Gautam

    Follow us on

    Anchor Rashmi : యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తనకు తప్పు అనిపిస్తే నిస్సంకోచంగా అభిప్రాయం తెలియజేస్తారు. కాగా ఈ రోజుల్లో ప్రేమలు, రిలేషన్స్ గురించి ఆమె చేసిన పోస్ట్ సంచలనం చేస్తుంది. విచ్చలవిడి శృంగారం అనే భావన కలిగించే ఒక బొమ్మను ఆమె షేర్ చేశారు. అలాగే ఓ ఘాటు కామెంట్ జోడించారు. ఈ రోజుల్లో డేటింగ్, లవ్ అంటే విచ్చలవిడి శృంగారం. శారీరక సుఖం కోసం వావి వరసలు మరచి శృంగారం చేస్తున్నారు.

    అందుకే దేవుడు అందించిన నిజమైన ప్రేమ దొరకడం లేదు. ఇలాంటి సంబంధాలు సమాజాన్ని విషపూరితంగా మార్చేస్తున్నాయి… అని కామెంట్ చేశారు. ఈ రోజుల్లో ప్రేమ అనేది నిజం కాదు. శృంగారం కోసమే ప్రేమ. అది కూడా ఏక కాలంలో ఒకరిద్దరితో చేస్తున్నారు. సమాజంలో విచ్చలవిడి శృంగారం పెరిగిపోయిందని రష్మీ అభిప్రాయ పడ్డారు. ఓపెన్ గా ఇంతటి ఘాటు కామెంట్స్ చేసిన రష్మీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది.

    రష్మీ గౌతమ్ యానిమల్ లవర్ కూడా. జీవహింస ఏ రూపంలో జరిగినా ఆమె సహించరు. సోషల్ మీడియా వేదికగా జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీధి కుక్కల పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇటీవల హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు మరణించాడు. ఈ సంఘటనలో రష్మీ పిల్లాడి తల్లిదండ్రులను తప్పుబట్టారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ కి ఉందని అభిప్రాయపడ్డారు.

    రష్మీ తీరుకు నెటిజెన్స్ మండిపడ్డారు. నీలాంటి వ్యక్తుల వలెనే వీధి కుక్కలను అదుపు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. మీరు కేసులు వేసి భయపెడుతున్నారు. నీకు కుక్కల పట్ల అంత ప్రేమ ఉంటే… నీ ఇంట్లో పెంచుకో అని ఎద్దేవా చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా రష్మీ తన అభిప్రాయం మార్చుకోలేదు. వీధి కుక్కల తప్పేమీ లేదన్నట్లు మాట్లాడారు. మరోవైపు రష్మీ సక్సెస్ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తున్నారు.