https://oktelugu.com/

Anchor Jhansi : 8 ఏళ్ళ వయస్సులోనే కష్టాలు..ఇండస్ట్రీ లో ఎంతోమంది నన్ను వాడుకొని వదిలేసారు అంటూ యాంకర్ ఝాన్సీ సంచలన కామెంట్స్!

ఝాన్సీ తనకి 8 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే రేడియో ప్రపంచంలోకి అడుగుపెట్టి చిన్నారి ఆర్జే గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత పెద్దయ్యాక యాంకర్ గా మారి ఎన్నో సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ చేసింది.

Written By: Vicky, Updated On : October 2, 2024 9:23 pm
Anchor Jhansi

Anchor Jhansi

Follow us on

Anchor Jhansi  : బుల్లితెర నుండి వెండితెర కి వెళ్లి సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. షారుఖ్ ఖాన్, రాజమౌళి, యాష్ వంటి వారు బుల్లితెర నుండి వచ్చినవారే. అయితే వీళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు మాత్రం అటు సినిమాల్లోనూ అవకాశాలు రాక, ఇటు బుల్లితెర మీద అవకాశాలను పోగొట్టుకొని అటు ఇటు కాకుండా కెరీర్ ని పోగొట్టుకున్నారు. రీసెంట్ గా అలా ఎన్నో ఉదాహరణలు చూసాము. కానీ బుల్లితెర నుండి సినీ ఇండస్ట్రీ లోకి వెళ్లిన ఒక యాంకర్ నటిగా కూడా సక్సెస్ అయ్యి, ఇప్పటికీ పాన్ ఇండియన్ క్రేజీ చిత్రాల్లో నటించేంత డిమాండ్ ని సంపాదించుకోగలరు అని అనిరూపించిన ఏకైక మహిళా ఝాన్సీ మాత్రమే. ఈమె తనకి 8 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే రేడియో ప్రపంచంలోకి అడుగుపెట్టి చిన్నారి ఆర్జే గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత పెద్దయ్యాక యాంకర్ గా మారి ఎన్నో సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ చేసింది. ఇప్పుడంటే మనం సుమ, శ్రీముఖి వంటి యాంకర్స్ ని రోజు టీవీలలో చూస్తున్నాం కానీ, ఆరోజుల్లో ఏ టీవీ పెట్టినా మనకి ఝాన్సీ మాత్రమే కనిపించేది.

ఆ స్థాయిలో ఆమె బుల్లితెర ని ఏలింది. అలా బుల్లితెర ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం కూడా మొదలయ్యాయి. సాధారణంగా బుల్లితెరకు అలవాటు పడిన నటీనటులు వెండితెర మీద అంత గొప్పగా ఆడియన్స్ కి అనిపించరు. యాంకర్ సుమ కూడా పలు సినిమాల్లో నటించింది కానీ, సక్సెస్ కాలేకపోయింది. కానీ ఝాన్సీ మాత్రం యాంకర్ గా ఎంత సక్సెస్ అయ్యిందో, నటిగా అంతకు మించి సక్సెస్ అయ్యింది. అందుకే ఈమెకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియన్ లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీని సృష్టించిన ‘సలార్’ వంటి క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో కూడా ఝాన్సీ ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ లో కనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో తాను ఎలాంటి కష్టాలను ఎదురుకోవాల్సి వచ్చిందో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఝాన్సీ.

ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటి లాగా అప్పట్లో 40 , 50 టీవీ చానెల్స్ ఉండేది కాదు. కేవలం రెండు టీవీ చానెల్స్ మాత్రమే ఉండేది. ఆ రెండు చానెల్స్ కోసం నలుగురు యాంకర్స్ పోటీ పడేవారు. నా కెరీర్ ని మలుపు తిప్పిన షో ఏదైనా ఉందా అంటే, అది ‘టాక్ ఆఫ్ ది టౌన్’ షో అని చెప్పగలను. ఈ ప్రోగ్రాం పెద్ద హిట్ అవ్వడం తో నాకు అవకాశాలు క్యూలు కట్టాయి. అదే సమయం లో ఇండస్ట్రీ లో నన్ను తొక్కేవారు కూడా ఎక్కువయ్యారు. కెరీర్ ప్రారంభంలో అందరి లాగానే నేను కూడా తప్పులు, పొరపాట్లు చేశాను కానీ, వాటిని సరిదిద్దుకుంటూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. చాలామంది డైరెక్టర్స్ కి నేను నచ్చేదానిని కాదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ని ఇచ్చినట్టు చదవాలి, నాకు ఏదైనా బాగాలేదు అనిపిస్తే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయించడం అలవాటు. అది కొంతమంది డైరెక్టర్స్ కి నచ్చేది కాదు. నాకు వచ్చే అవకాశాలకు కూడా గండికొట్టేవారు. కొన్ని ఈవెంట్స్ నా వల్ల గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కానీ నేను లేకుండా సంబరాలు చేసుకునేవారు, అలా నన్ను ఇండస్ట్రీ లో చాలామంది వాడుకొని వదిలేసారు’ అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ.