https://oktelugu.com/

Konda Surekha : టార్గెట్ సురేఖ.. ఆడియో లీకులు.. అధిష్టానం సీరియస్ అంటూ రచ్చ

నిన్నా మొన్నటి దాకా హైడ్రా చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు.. ఒక్కసారిగా రూట్ మార్చాయి. కొండా సురేఖ కేంద్రంగా అవి మారిపోయాయి. బుధవారం ఏ ముహూర్తాన ఆమె నాగచైతన్య - సమంత విడాకుల మీద వ్యాఖ్యలు చేశారో.. ఇక ఆ తర్వాత రాజకీయంగా పరిణామాలు వేగంగా మారిపోయాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 2, 2024 / 09:48 PM IST

    Konda Surekha

    Follow us on

    Konda Surekha :  సాధారణంగా కొండా సురేఖకు సామ్యురాలు అనే పేరు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా ఉండేవారు.. ఆమె భర్త కొండా మురళీధర్ రావు ఎమ్మెల్సీగా కొనసాగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. అంతటి తెలంగాణ ఉద్యమంలో వైఎస్ఆర్సిపి తరఫున పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి.. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు మహబూబాబాద్ ఘటనలోనూ కొండా సురేఖ జగన్ కు అండగా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడటం.. కొండా సురేఖ మారిన రాజకీయ పరిస్థితులలో భారత రాష్ట్ర సమితిలో చేరిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో సురేఖ భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అటవీశాఖ, దేవాదాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం నిమిత్తం ఆమె పర్యటించగా.. ఆ కార్యక్రమానికి మెదక్ బిజెపి పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన నేత కార్మికులు రూపొందించిన నూలు పోగు దండను సురేఖకు బహుకరించారు. ఈ ఫోటోపై భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు దుష్ప్రచారం చేశారని కొండా సురేఖ ఇటీవల ఆరోపించారు. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ.. అలాంటి చర్యలు సరికావని వ్యాఖ్యానించారు. ఆ ఘటన జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే సురేఖ సమంత – నాగచైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విడాకుల వెనుక అప్పటి ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆమె ఆరోపించారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేయడమే ఆలస్యం.. తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

    సమంత – నాగచైతన్య చుట్టూ..

    ఈ సమయంలోనే భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం రెచ్చిపోవడం మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తోంది. హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వస్తున్న భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం.. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతోంది. ఈ క్రమంలోనే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల ఆరా తీసిందని.. పార్టీని నాశనం చేస్తున్నారని.. ఇలా అయితే కష్టం అనే తీరుగా సురేఖ పై అధిష్టానం మండిపడిందనట్టుగా ట్వీట్లు చేస్తోంది. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. కొండా సురేఖ మాట్లాడిన మాటలు సబబే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో సురేఖ గతంలో మాట్లాడిన మాటల తాలూకు ఆడియోను భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం వారు తెగ పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా నిన్నటిదాకా హైడ్రా చుట్టూ సాగిన తెలంగాణ రాజకీయాలు.. ఒకసారిగా రూట్ మార్చుకున్నాయి. ఇప్పుడు సురేఖ కేంద్రంగా సమంత – నాగ చైతన్య చుట్టూ తిరుగుతున్నాయి.