Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బాటలో అనసూయ… వాస్తవం తెలిసొచ్చిందా?

Sudigali Sudheer: ఢీ వేదికగా సుధీర్ తన మల్టీ టాలెంట్స్ చూపించాడు. సుధీర్ ప్రొఫెషనల్ మెజీషియన్. పాటలు పాడతాడు, డాన్సులు వేస్తాడు. వీటికి తోడు యాంకర్ రష్మీతో అతడి కెమిస్ట్రీ బుల్లితెర మీద బాగా వర్క్ అవుట్ అయ్యింది.

Written By: S Reddy, Updated On : June 13, 2024 10:34 am

Anasuya in the path of Sudigali Sudheer

Follow us on

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి వాస్తవం బోధ పడినట్లుంది. తిరిగి యాంకర్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాలపై ఫోకస్ తగ్గించాడు. సుధీర్ బాటలోనే అనసూయ నడుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సుడిగాలి సుధీర్ బుల్లితెర స్టార్. జబర్దస్త్ వేదికగా ఈ టాలెంటెడ్ ఫెలో వెలుగులోకి వచ్చాడు. మొదట్లో సుడిగాలి సుధీర్ టీమ్ మెంబర్ గా చేశాడు. సీనియర్స్ కొందరు జబర్దస్త్ వీడటంతో సుడిగాలి సుధీర్ కి లీడర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అతనికి విషయం ఉన్న ఇద్దరు కమెడియన్స్ తోడయ్యారు.

ఆటో రామ్ ప్రసాద్ స్కిట్స్ రాసేవాడు. ఇక గెటప్ శ్రీను తన నటన, గెటప్స్ తో స్కిట్ పండించేవారు. కామెడీ పండించడంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఒకరితో మరొకరు పోటీ పడతారు. ఈ ముగ్గురికి హిట్ కాంబినేషన్. సంచలనాలు నమోదు చేశారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ చేస్తూనే ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. యాంకర్ గా అక్కడ సక్సెస్ అయ్యాడు.

Also Read: Family Stars Promo: ప్యాకప్ అయ్యాక నన్ను కలువు… పెళ్ళైన యాంకర్ ని నేరుగా అడిగేసిన సుడిగాలి సుధీర్!

ఢీ వేదికగా సుధీర్ తన మల్టీ టాలెంట్స్ చూపించాడు. సుధీర్ ప్రొఫెషనల్ మెజీషియన్. పాటలు పాడతాడు, డాన్సులు వేస్తాడు. వీటికి తోడు యాంకర్ రష్మీతో అతడి కెమిస్ట్రీ బుల్లితెర మీద బాగా వర్క్ అవుట్ అయ్యింది. టెలివిజన్ రారాజుగా వెలుగొందుతున్న సుధీర్ హీరో కావాలని అటువైపు అడుగులు వేశాడు. గాలోడు మూవీతో సక్సెస్ కూడా చవి చూశాడు. అయితే ఆ ట్రాక్ కొనసాగించడం అంత సులభం కాదు. సుడిగాలి సుధీర్ నటిస్తున్న గోట్ మూవీ ఆగిపోయిందని సమాచారం.

Also Read: Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 లో హాట్ బ్యూటీస్… ఆడియన్స్ కి పండగే! లిస్ట్ వచ్చేసింది!

దాంతో మరలా యాంకరింగ్ వైపు అడుగులు వేశాడు. ఫ్యామిలీ స్టార్స్, సర్కార్ పేరుతో రెండు గేమ్ షోలు చేస్తున్నాడు. సుధీర్ మాదిరి అనసూయ కూడా యాంకరింగ్ వైపు వస్తున్న సూచనలు కనిపిస్తుంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని తెగేసి చెప్పిన అనసూయ ఇటీవల కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో ఓ షో చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. సినిమా ఆదాయం పెద్ద మొత్తంలో ఉన్నా గ్యారంటీ లేనిది. బుల్లితెర ఆదాయం తక్కువగా ఉన్నా ప్రతి నెలా వస్తుంది.