https://oktelugu.com/

Jammu Attack : రెచ్చిపోతున్న జమ్మూ ఉగ్రవాదులకు భారత్ జవాబు దిమ్మతిరగాలి

రెచ్చిపోతున్న జమ్మూ ఉగ్రవాదులకు భారత్ జవాబు దిమ్మతిరగాలి.. ఈ విషయంలో ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : June 13, 2024 / 10:59 AM IST

    Jammu Attack : మూడు రోజుల్లో మూడు ఉగ్రవాద ఉన్మాద చర్యలు జమ్మూ కశ్మీర్ లో కలకలం రేపాయి. 9వ తేదీన రియాసీలోని శివకోటి దేవాలయం.. ఆత్రా వైష్ణవి దేవాలయానికి వచ్చిన హిందూ భక్తులపై జరిగిన ఉగ్రదాడిలో 9 మంది మరణించారు.. 41 మంది తీవ్రగాయాలపాలయ్యారు.

    11వ తేదీన సైదా సుఖోల్ గ్రామంలో ఉగ్రవాదులు చొరబడి మంచినీళ్లు అడిగితే ఇవ్వలేదని గొడవ జరిగి కాల్పులు జరిగితే ఒక పౌరుడు మరణించాడు.

    ఇక ఘోడా జిల్లాలో ఆర్మీ క్యాంపు మీద ఆర్మీ జవాన్లను గాయపరిచారు. మూడు ఉగ్రవాద చర్యలు జమ్మూ ప్రాంతంలో జరిగిన ఘోరాతి ఘోరమైన ఉన్మాద చర్యలు..

    జమ్మూలో రెండేళ్ల పసిపాపను చంపిన ఉగ్రవాదుల మీద ప్రపంచం మాట్లాడదా? 14 ఏళ్ల బాలికను చంపారు.. దీనిపై స్పందించరు.. జమ్మూలో 1990 నుంచి హిందువులపై దాడులు జరిగి అమాయక పౌరులను చంపడం జరుగుతూనే ఉంది.

    రెచ్చిపోతున్న జమ్మూ ఉగ్రవాదులకు భారత్ జవాబు దిమ్మతిరగాలి.. ఈ విషయంలో ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.