Singareni Jobs: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సమస్థ సింగరేణి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అర్హతలు ఇవీ..
– వివిధ పోస్టులను బట్టి పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణ పొంది ఉండాలి.
– దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ఇలా..
ఇక అభ్యర్థుల ఎంపికకు ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు, ఆధారంగా నియామకాలు చేస్తారు.
దరఖాస్తు ఫీజు..
ఇక సింగరేణి ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజును జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇవీ…
ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో పోస్టుల వివరాలు..
మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఇ అండ్ ఎం), ఇ2 గ్రేడ్ పోస్టులు: 42
మేనేజ్‌మెంట్ ట్రైనీ(సిస్టమ్స్), ఇ2 గ్రేడ్ పోస్టులు: 7
నాన్–ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో పోస్టుల వివరాలు..
జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ(జేఎంఈటీ), టీ అండ్ ఎస్ గ్రేడ్–సి పోస్టులు: 100
అసిస్టెంట్ ఫోర్‌మెన్∙ట్రైనీ (మెకానికల్), టీ అండ్ ఎస్ గ్రేడ్–సి పోస్టులు: 9
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టీ అండ్ ఎస్ గ్రేడ్–సి పోస్టులు: 24
ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ–ఐ పోస్టులు: 47
ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ–ఐ పోస్టులు: 98