https://oktelugu.com/

Family Stars Promo: ప్యాకప్ అయ్యాక నన్ను కలువు… పెళ్ళైన యాంకర్ ని నేరుగా అడిగేసిన సుడిగాలి సుధీర్!

తాజా ఎపిసోడ్ కి పంచ్ ప్రసాద్, యాదమ్మ రాజుతో పాటు పలువురు బుల్లితెర సెలెబ్స్ హాజరయ్యారు. ఈ షోలో సుడిగాలి సుధీర్ తో పాటు మరొక యాంకర్ స్రవంతి చొక్కారపు సైతం సందడి చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 12, 2024 / 05:57 PM IST

    Family Stars Promo

    Follow us on

    Family Stars Promo: సుడిగాలి సుధీర్ బుల్లితెర పై మరలా బిజీ అయ్యాడు. ఆయన ఈటీవీలో ఓ గేమ్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మొదలైన సదరు గేమ్ షో అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ పేరుతో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న గేమ్ షోకి ప్రతివారం కొందరు సెలెబ్స్ వస్తున్నారు. వారితో సుడిగాలు సుధీర్ ఆడించే ఆటలు, పాటలు అలరిస్తున్నాయి. సుడిగాలి సుధీర్ పంచులు, ఆయనపై గెస్ట్స్ సెటైర్స్ మామూలుగా పేలడం లేదు.

    తాజా ఎపిసోడ్ కి పంచ్ ప్రసాద్, యాదమ్మ రాజుతో పాటు పలువురు బుల్లితెర సెలెబ్స్ హాజరయ్యారు. ఈ షోలో సుడిగాలి సుధీర్ తో పాటు మరొక యాంకర్ స్రవంతి చొక్కారపు సైతం సందడి చేసింది. వీరిద్దరి మధ్య రొమాన్స్ హైలెట్ గా నిలిచింది. భార్య భర్తలు ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్న నేపథ్యంలో జంటల మధ్య బిందిలో ఉంగరం తీసే ఆట కండక్ట్ చేశారు.

    ఫస్ట్ పంచ్ ప్రసాద్ తన భార్యతో పోటీపడ్డాడు. ఈ గేమ్ జరుగుతుండగా… ‘బావా మనం కూడా చేద్దాం’ అని కవ్వింపుగా సుడిగాలి సుధీర్ తో అంది యాంకర్ స్రవంతి. ఆ మాటకు ‘నేను నీకు చెప్తాను. నువ్వు ప్యాక్ అయ్యాక కలవ్వు’ అన్నాడు. ఇద్దరి మధ్య డబుల్ మీనింగ్ డైలాగ్స్ చోటు చేసుకోగా గేమ్ షోలో పాల్గొన్నవారందరూ గట్టిగా నవ్వేశారు. సుడిగాలి సుధీర్ తన ప్లే బాయ్ ఇమేజ్ కొనసాగిస్తూ ఆ తరహా కామెడీ చేస్తున్నాడు.

    ఇక పెళ్ళై పిల్లలున్న యాంకర్ స్రవంతి సత్తా చాటుతుంది. సినిమా ఫంక్షన్స్ కి సైతం స్రవంతి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక సుడిగాలి సుధీర్ విషయానికి వస్తే.. యాంకర్ గా మరలా బిజీ అయ్యాడు. సర్కార్ పేరుతో ఆహాలో ఓ షో చేస్తున్నాడు. సర్కార్ సీజన్ 4 సక్సెస్ఫుల్ గా సాగుతుంది. కాగా గోట్ టైటిల్ తో సుడిగాలి సుధీర్ ఓ మూవీ ప్రకటించారు. ఈ చిత్రం ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. హీరోగా సుధీర్ కెరీర్ నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి.