Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 లో హాట్ బ్యూటీస్… ఆడియన్స్ కి పండగే! లిస్ట్ వచ్చేసింది!

ప్రతి సీజన్ మొదలయ్యే ముందు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది వీళ్ళే అంటూ కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరి సెలెబ్రెటీలు, యూట్యూబర్స్ పేర్లు వినిపిస్తుంటాయి.

Written By: S Reddy, Updated On : June 11, 2024 8:19 am

Bigg Boss 8 Telugu

Follow us on

Bigg Boss 8 Telugu: బుల్లితెర మోస్ట్ పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో సరికొత్త సీజన్ కి రంగం సిద్ధం అయింది. సీజన్ 7 ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ 7 సూపర్ హిట్ కావడంతో సీజన్ 8 అంతకు మించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపిక, ఫ్యాన్ పేజీలు వంటి పనులు చకచకా సాగుతున్నాయని సమాచారం.

అయితే ప్రతి సీజన్ మొదలయ్యే ముందు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది వీళ్ళే అంటూ కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరి సెలెబ్రెటీలు, యూట్యూబర్స్ పేర్లు వినిపిస్తుంటాయి. అయితే వాళ్ళు హౌస్ లోకి వెళ్తారా లేదా అన్నది చివరి నిమిషం వరకు సస్పెన్సు అని చెప్పాలి. ఈ క్రమంలో సీజన్ 8 కి సంబందించిన కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

దాదాపు హౌస్ లోకి వెళ్ళేది వీళ్లే అని, ఈ లిస్ట్ ఫైనల్ అంటూ టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే .. హీరో రాజ్ తరుణ్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి హేమ, సోనియా సింగ్, ఫార్మింగ్ నేత్ర, వంశీ, సురేఖ వాణి లేదంటే ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పీ, రీతూ చౌదరి, కుమారి ఆంటీ, బర్రెలక్క, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్, కుషిత కొల్లపు.

బుల్లెట్ భాస్కర్, వారితో పాటు కొంతమంది పాత కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందట. నయని పావని, భోలే షావలి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వైరల్ అవుతున్న ఈ లిస్ట్ లో ఎంతమంది ఫైనల్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున సీజన్ 8 కి కూడా హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు.