Homeఎంటర్టైన్మెంట్Anasuya : అలాంటి బట్టల్లో అనసూయ, భర్త ఏమీ అనడా? స్టార్ యాంకర్ సమాధానం ఇదే

Anasuya : అలాంటి బట్టల్లో అనసూయ, భర్త ఏమీ అనడా? స్టార్ యాంకర్ సమాధానం ఇదే

Anasuya : సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ… సీనియర్ తెలుగు యాంకర్స్. ఇంకా పలువురు ఉన్నారు. వీరు తొలితరం తెలుగు టెలివిజన్ యాంకర్స్ అని చెప్పుకోవచ్చు. డ్రెస్సింగ్ విషయంలో వీరు కొన్ని నియమాలు పాటించారు. ఉదయభాను కొంచెం ట్రెండీ దుస్తుల్లో కనిపించేది. అయితే స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. యాంకర్ అంటే నిండైన బట్టల్లో కనిపించాలి అనే నియమాన్ని అనసూయ భరద్వాజ్ బ్రేక్ చేసింది. జబర్దస్త్ షో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ పొట్టి బట్టల్లో గ్లామర్ షోకి తెరలేపింది.

Also Read : శేఖర్ మాస్టర్ పై అనసూయ ఫైర్..కంట్రోల్ లో ఉండు అంటూ వార్నింగ్!

కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి చూసే టెలివిజన్ షోలలో గ్లామర్ షో చేయడం సరికాదు, అనే వాదన బలంగా వినిపించింది. ఈ క్రమంలో అనసూయ డ్రెస్సింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సందర్భంలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సైతం అనసూయ డ్రెస్సింగ్ ని ఉద్దేశించి మాట్లాడాడు. అనసూయ అందంగా ఉంటుంది. ఆమె పొట్టి బట్టలు ధరించాల్సిన అవసరం లేదు, అన్నాడు. ఈ విమర్శలకు అనసూయ ఘాటైన సమాధానం ఇచ్చింది. ఎన్ని విమర్శలు వచ్చినా, అనసూయ తన పంథా మార్చుకోలేదు.

సోషల్ మీడియాలో కూడా అనసూయ మీద విపరీతమైన నెగిటివిటి ఉంటుంది. తన హేటర్స్ మరింత కుళ్ళుకునేలా అనసూయ చర్యలు ఉంటాయి. చివరికి బికినీ ఫోటోలు కూడా షేర్ చేసి తన గట్స్ ఏమిటో చాటుకుంది అనసూయ. ఒకరి కోసం నేను బ్రతకను, నా కోసం నేను బ్రతుకుతాను అంటుంది. బయటవాళ్ళ సంగతి సరే, అనసూయను కుటుంబ సభ్యులు ఏమీ అనరా? ఆమె భర్త ఫీలింగ్ ఏంటి? ఈ ప్రశ్నలకు అనసూయ సమాధానం చెప్పింది. విమర్శలతో నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరిగింది. కానీ ఏకాగ్రత కోల్పోకుండా నా లక్ష్యం వైపు నేను వెళ్ళాను, అని అనసూయ అన్నారు.

Also Read : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ..

15 ఏళ్ళు నాకు కెరీర్ ఉంటుందని భర్త వద్ద ముందే పర్మిషన్ తీసుకున్నాను. అందుకే నా కుటుంబ సభ్యులు నాకు సహకరిస్తున్నారు. నా వృత్తిలో కొనసాగుతూనే తల్లిగా, భార్యగా, గృహిణిగా నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను, అని అనసూయ చెప్పుకొచ్చింది. తన కెరీర్ విషయం లో కొన్నేళ్లు స్వేచ్ఛ వదిలేయాలని అనసూయ భర్త వద్ద అనుమతి తీసుకున్నట్లు పరోక్షంగా వెల్లడించింది. కెరీర్ కోసమే స్కిన్ షో అని అనసూయ చెప్పకనే చెప్పింది.

RELATED ARTICLES

Most Popular