Students Studying Abroad : ఏపీ ప్రభుత్వం( AP government) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించనుంది. సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని పున ప్రారంభించనున్నారు. పథకం అమలుకు అధికారుల సైతం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేసింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో పధకం పునరుద్ధరణకు నిర్ణయించింది.
Also Read : విదేశాల్లో యువతకు ఉద్యోగాలు.. నెలకు రూ.3 లక్షలు.. ఏపీ ప్రభుత్వం ఒప్పందం!*
* తాజా ప్రతిపాదనలతో..
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి( Ambedkar Overseas Vidya Nidhi ) పథకం కింద రాష్ట్రంలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు అందిస్తారు. అదే బిసి, మైనారిటీలకు రూ.20 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చులకోసం మరో ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా సూచించారు. పీజీ పీహెచ్డీ ఎంబీబీఎస్ కోర్సులకు ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు అధికారులు. క్యూఎస్ ర్యాంకింగ్ ఆధారంగా 2005 ఉత్తమ యూనివర్సిటీలో సీటు వచ్చిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేలా ప్రతిపాదనలు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ కొత్త పథకంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం లభిస్తుందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు లోకేష్.
* టిడిపి హయాంలో పటిష్టంగా..
2014లో టిడిపి( Telugu Desam Party ) అధికారంలోకి వచ్చింది. అంబేద్కర్, ఎన్టీఆర్ పేర్లతో ఈ విదేశీ విద్యకు సంబంధించిన పథకాన్ని అమలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న విదేశీ విద్యగా ఈ పథకాన్ని పేరు మార్చారు. అయితే సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం కేవలం 50 యూనివర్సిటీలో చదువుకునే వారికి మాత్రమే పరిమితం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం మాత్రం 250 యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికి ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించడం విశేషం. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : ఏపీలో 10 నెలల పాలన.. విపత్తులు, ప్రమాదాలు, వివాదాలు!