Sunrisers : హైదరాబాద్ జట్టు గత సీజన్లో రన్నరప్. ఈ సీజన్లో మాత్రం ఆ స్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేదు. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై భారీ స్కోరు చేసింది. ఓన్ గ్రౌండ్లో గెలిచింది. కానీ ఆ తర్వాత పరాజయాల బాట పట్టింది. వాడు చేసిన పనికి మొత్తానికి 10 మ్యాచ్ లు ఆడి, అందులో ఏడు ఓటములు మూట కట్టుకుంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. సోమవారం ఢిల్లీ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాకపోయి ఉంటాయి హైదరాబాద్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు బౌలింగ్లో రాణించారు. అద్భుతంగా బంతులు వేసి వికెట్లు పడగొట్టారు. జోరు మీద ఉన్న ఢిల్లీ జట్టును భారీ స్కోర్ చేయనీయకుండా అడ్డుకున్నారు. ప్రతి దశలోనూ కట్టుదిట్టంగా బంతులు వేస్తూ అడ్డగించారు. ఢిల్లీ జట్టును 133 రన్స్ కే పరిమితం చేశారు. 134 పరుగులు విజయ లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాటర్లు సులువుగా చేదిస్తారని అభిమానులు అనుకున్నారు. ఆ దిశగానే అంచనాలు కూడా వేసుకున్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తే.. అది కూడా భారీవ్యత్యాసంతో విజయం సాధిస్తే తిరుగు ఉండదని భావించారు. కానీ వారి అంచనాలపై వరుణుడు పూర్తిగా నీళ్లు చల్లాడు.
Also Read : కొత్త విమానమైనా.. సన్ రైజర్స్ రాత మార్చుతుందా..
ఇంటికి వెళ్లిపోయింది
సోమవారం ఢిల్లీ జట్టుతో జరుగుతున్న కీలక మ్యాచ్లో హైదరాబాద్ ఆశలపై వర్షం నీళ్ళు చల్లింది. వరుణుడు హైదరాబాద్ ఆశలను నిండా మంచాడు.. హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభమవుతుందనగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయింది. ఆ తర్వాత చిన్నచిన్న చినుకులు మొదలయ్యాయి. ఆ తర్వాత భారీగా వర్షం ప్రారంభమైంది. గంట పాటు ఏకధాటిగా వర్షం కురిసింది .. వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు మైదానాన్ని పరిశీలించగా.. అవుట్ ఫీల్డ్ అత్యంత చిత్తడిగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చారు.. దీంతో రెండవ ఇన్నింగ్స్ లో ఒక్క బంతి కూడా పడక ముందే మ్యాచ్ రద్దయింది. దీంతో అంపైర్లు రెండు జట్లకు చేరి రెండు పాయింట్లు కేటాయించారు. ఈ పాయింట్లు కలుపుకుంటే హైదరాబాద్ అకౌంట్లో ఏడు పాయింట్లు మాత్రమే ఉండడంతో.. అఫీషియల్ గా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ తన తదుపరి మ్యాచులు కోల్ కతా, లక్నో, బెంగళూరు జట్లతో తలపడాల్సి ఉంది. హైదరాబాద్ జట్టు ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల కావడంతో అభిమానులు ఆవేదనలో కూరుకు పోయారు. ” హైదరాబాద్ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారని భావించాం. ఢిల్లీ జట్టును తక్కువ స్కోరుకు పరిమితం చేశారని సంబరపడ్డాం. కానీ మా ఆనందాన్ని వర్షం ఆవిరి చేసింది. మా ఉత్సాహంపై నీళ్లు చల్లింది. మొత్తంగా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ వెళుతుందనే అంచనాలు సర్వనాశనమయ్యాయని” సోషల్ మీడియాలో హైదరాబాద్ జట్టు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నాలుగు పరాజయాలు వరుసగా.. SRH ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే..