Homeఎంటర్టైన్మెంట్Ananya Nagalla Bold Comments: హద్దులు దాటేసిన యంగ్ హీరోయిన్.. ప్రతీ డోర్ దగ్గర అలాంటి...

Ananya Nagalla Bold Comments: హద్దులు దాటేసిన యంగ్ హీరోయిన్.. ప్రతీ డోర్ దగ్గర అలాంటి పనులు చేస్తానంటూ బోల్డ్ కామెంట్స్..

Ananya Nagalla Bold Comments: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు అనన్య నాగేళ్ల. ఈమధ్య కాలం లో ఈమె వార్తల్లో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన విషయం లో ఈమె కూడా ఈడీ అధికారుల వద్ద విచారణ ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఆమె అందుకు వివరణ కూడా ఇచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే , సినిమాల్లో ఈమె గ్లామరస్ […]

Ananya Nagalla Bold Comments: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు అనన్య నాగేళ్ల. ఈమధ్య కాలం లో ఈమె వార్తల్లో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన విషయం లో ఈమె కూడా ఈడీ అధికారుల వద్ద విచారణ ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఆమె అందుకు వివరణ కూడా ఇచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే , సినిమాల్లో ఈమె గ్లామరస్ రోల్స్ లో కనిపించదు కానీ , తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మాత్రం హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులను మెంటలెక్కిపోయేలా చేస్తోంది. లేటెస్ట్ గా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి సబ్ స్క్రిప్షన్ అనే ఫీచర్ ని జత చేసుకుంది. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేగింది.

సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ లక్షలు బాగానే సంపాదిస్తున్నావ్ , విష్ణు ప్రియా వంటి వారు అయితే , సాధారణ టీవీ యాంకర్స్, వాళ్లకు పెద్దగా ఆదాయం ఉండదు కాబట్టి , సబ్ స్క్రిప్షన్స్ ద్వారా అందాలను ఆరబోస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు , కానీ నీకమైంది?, ఒక యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ వి అయ్యుండి ఇంతలా దిగజారాలా అంటూ సోషల్ మీడియా లో అనన్య నాగేళ్ల పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అనన్య నాగేళ్ల ఈ విమర్శలను , ట్రోలింగ్స్ ని అసలు పట్టించుకోవడం లేదు. తన మనసుకి నచ్చిన పని చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. లేటెస్ట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక పోస్ట్ , దానికి ఆమె పెట్టిన బోల్డ్ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపింది. పొట్టి దుస్తులు ధరించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ‘కనిపించిన ప్రతీ తలుపు వద్ద ఫోటోలు దిగితే ఇలాగే ఉంటుంది.. ? ఇదే కదా మీరు ఇప్పుడు చేయబోయే కామెంట్, నాకు ముందే తెలుసు’ అంటూ వెటకారంగా చెప్పుకొచ్చింది.

ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక అనన్య నాగేళ్ల సినీ ప్రస్థానం విషయానికి వస్తే ఈమె 2019 వ సంవత్సరం లో విడుదలైన ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం లో ఈమె కీలక పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా ద్వారా వచ్చిన ఫేమ్ , క్రేజ్ తో వరుసగా సినిమా అవకాశాలను సంపాదించుకుంటూ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా మారింది. హీరోయిన్ గా మాత్రమే కాదు , క్యారెక్టర్ రోల్స్ లో కూడా మెరుస్తూ తన మార్కు ని చూపించుకుంది. ప్రస్తుతం ఆమె ‘లేచింది మహిళా లోకం’, ‘లీసా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper