Homeక్రైమ్‌Krishnalanka CI Nagaraju Case: కృష్ణలంక సీఐ నాగరాజు ఏం చేశారు.. గాదె సాయి కృష్ణ...

Krishnalanka CI Nagaraju Case: కృష్ణలంక సీఐ నాగరాజు ఏం చేశారు.. గాదె సాయి కృష్ణ కేసులో అసలు నిజం ఇది..

Krishnalanka CI Nagaraju Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ గురించి మీడియాలో ప్రభుత్వంగా వార్తలు వస్తున్నాయి. ఈ పోలీస్ స్టేషన్లో నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల గాదే సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి.. అదృశ్యం కావడంతో నాగరాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాయి కృష్ణ మీద రౌడీషీట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇతడి మీద అనేక రకాలుగా కేసులు ఉన్నాయి.

సాయి కృష్ణ అదృశ్య ఘటనను వైసిపి తనకు అనుకూలంగా మార్చుకుంది. ఏకంగా వైసీపీ అధినేతల జగన్ సాయి తల్లిని పరామర్శించారు. ఇక్కడ కులం గురించి మాట్లాడారు. అంతేకాదు, కొద్దిరోజుల ముందు వైసీపీ నేత అంబటి రాంబాబు పిల్ల సాయి వ్యవహారంలో సరికొత్త బాంబు పేల్చారు. ఆయనను పోలీసులు హత మార్చారని ఒక ఫోటోను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఏపీలో కలకలం నెలకొంది.

ఈ సంఘటనలు ఇలా జరుగుతుండగానే.. పేరిపోగు క్రాంతి కుమార్ అనే యువకుడు తీసుకున్న వీడియో సంచలనం గా మారింది. ఇతడు క్రైమ్ సస్పెక్ట్ షీటర్. సాయి కృష్ణ సిఐ నాగరాజు చిత్రహింసలు పెడుతున్న తీరు తాను చూశాను అంటూ మహంకాళి చందు అని క్రైమ్ సస్పెక్ట్ షీటర్ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. సిఐ నన్ను కొడుతున్నారని క్రాంతికుమార్ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. క్రాంతి కుమార్ మే నెలలో 21న బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతడు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పేరి పోగు వెంకటేశ్వరరావు కుమారుడు.

ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే క్రైమ్ సస్పెక్ట్ సీటు ఉన్న వారి ఇండ్లకు వెళ్లి పరిశీలన జరుపుతున్నారు. అంతేకాదు పోలీసులు పదేపదే ఇంటికి రావడం.. భార్యతో వివాదాలు సాగుతున్న నేపథ్యంలో క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో వెంకటేశ్వరరావు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తాజాగా క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో బయటికి రావడంతో కలకలం నెలకొంది. క్రాంతికుమార్ గతంలో చైన్ స్నాచింగ్.. బైండోవర్ కేసుల్లో శిక్షలు ఎదుర్కొన్నాడు.

ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్ సురేష్.. క్రాంతికుమార్ సరిగ్గా రెండు నెలల క్రితం విజయవాడలో ఉన్న ఒక బార్ కు వెళ్లారు. అక్కడ విపరీతంగా తాగారు. అంతేకాదు మధ్యమధ్యలో అక్కడ సిబ్బంది మీద దారుణంగా దాడి చేశారు. ఈ విషయం తెలిసిన నేపథ్యంలో సురేష్ మీద పోలీసులు శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు.

మరోవైపు సాయి కృష్ణను పోలీసులు చిత్రహింసలు పెడుతున్న తీరును తాను చూశానని కృష్ణలంక ప్రాంతానికి చెందిన క్రైమ్ సస్పెక్ట్ షీటర్ చందు అలియాస్ పూరి ఒక వీడియోను విడుదల చేశాడు..”నేను లాకప్ లోనే ఉన్నాను. అప్పుడు సాయి కృష్ణను తీసుకువచ్చారు. అతడిని తీవ్రంగా కొట్టారు. అతని మీద విపరీతంగా కేసులు ఉన్నాయి. ఆరోజు నన్ను జైలు నుంచి బయటకు పంపించారు. సాయి కృష్ణ మీద కేసులు ఉన్నాయి. అతడు బెయిల్ మీద అనేక సందర్భాల్లో బయటకు వచ్చాడు. ఆరోజు నన్ను స్టేషన్ నుంచి ఎందుకు బయటకు పంపించారో తెలియదు” అని చందు తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. అయితే నాగరాజు చుట్టూ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular