Pushpa 2: పుష్ప 2 సినిమా మీద ప్రస్తుతం విపరీతమైన బజ్ అయితే ఉంది. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమా ప్రేక్షకులందరిలో అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ విపరీతమైన హైప్ అయితే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల సినిమాకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా అనే ధోరణిలో కూడా సినిమా మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా కూడా ఆ అంచనాన్నింటిని సినిమా రీచ్ అవుతుంది అంటూ సుకుమార్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తన కాన్ఫిడెంట్ కి కారణం ఈ సినిమా బాగా రావడమే అంటూ మరికొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో నుంచి వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు పుష్ప సినిమాకి ‘నేషనల్ అవార్డు’ అయితే వచ్చింది. ఇక దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో తన పర్ఫామెన్స్ అయితే ఉండబోతుందట.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఎవరు చేస్తున్నారనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక బన్వర్ సింగ్ షెకావత్, మంగళం శ్రీను విలన్స్ గా ఉన్నప్పటికి మొదటి పార్ట్ లో కొండారెడ్డి విలనిజానికి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. కాబట్టి సెకండ్ పార్ట్ లో కూడా అలాంటి ఒక విలన్ అయితే ఉండబోతున్నాడట. సిండికేట్ లో పుష్ప రాజ్ ను ఢీకొట్టే ఒక పాత్రలో ఆ విలన్ కనిపించబోతున్నాడు.
మరి ఇంతకీ ఆయన ఎవరు అనేది మాత్రం ఎక్కడా రివీల్ చేయడం లేదు. థియేటర్లోనే ఈ సస్పెన్స్ కు తెరదించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి సుకుమార్ తను అనుకున్న విధంగానే ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…