https://oktelugu.com/

Pushpa 2: చిరంజీవి ఇంటికి పుష్ప 2 నిర్మాతలు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్?

మెగాస్టార్ చిరంజీవి తో పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేయించి టికెట్ రేట్స్ ఇప్పించాల్సిందిగా కోరేందుకు వెళ్లారని తెలుస్తుంది. ఇది కేవలం సోషల్ మీడియా లో నడుస్తున్న ట్రోల్ల్స్ మాత్రమే.

Written By:
  • Vicky
  • , Updated On : December 2, 2024 / 07:02 PM IST

    Pushpa 2(17)

    Follow us on

    Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం కోసం నిర్మాతలు పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా మొదలు కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథులు ఎవ్వరు లేరు కానీ, పుష్ప 2 నిర్మాతలు నేడు చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి రావడం ఆసక్తికరంగా మారింది. దీని పై సోషల్ మీడియా లో అనేక విధాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిర్మాతలు అడిగినంత టికెట్ రేట్స్ ఇవ్వడానికి నిరాకరించాడని, అందుకే మెగాస్టార్ చిరంజీవి తో పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేయించి టికెట్ రేట్స్ ఇప్పించాల్సిందిగా కోరేందుకు వెళ్లారని తెలుస్తుంది. ఇది కేవలం సోషల్ మీడియా లో నడుస్తున్న ట్రోల్ల్స్ మాత్రమే.

    కానీ అసలు విషయం వేరే ఉంది. గడిచిన కొద్ది నెలలుగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. నంద్యాల ఘటన తర్వాత చిరంజీవి అభిమాన సంఘాలు, జనసేన పార్టీ నాయకులూ పుష్ప 2 చిత్రానికి సహకరించడం లేదు. వాళ్ళు సహకరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బెన్ఫిట్ షోస్ ని వేసే ఆర్గనైజర్లు ఉండరు. సినిమాకి ప్రభుత్వం నుండి అయితే టికెట్ రేట్స్ పెంపు కొరకు అనుమతి వచ్చేసింది. ప్రీమియర్ షోస్ కి 800 రూపాయిల టికెట్ రేట్స్, బెన్ఫిట్ షోస్ కి వెయ్యి రూపాయిల రేట్స్ పెట్టె ప్లాన్ లో ఉన్నారు. కానీ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ముందుకు రాకపోవడమే అసలు సమస్య. అందుకే చిరంజీవి ని కలిసి, చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు కరణం స్వామి నాయుడు చేత బెన్ఫిట్ షోస్ కి సహకరించమని గ్రౌండ్ లెవెల్లో ఉండే మెగా అభిమాన సంఘాలకు చెప్పించే కార్యక్రమం కోసం నిర్మాతలు చిరంజీవి ని కలిశారట.

    ఈ సమస్య కాసేపట్లో తొలగనుంది. నిర్మాతలు చిరంజీవి ని కలవడం పై మరో కథనం కూడా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో నాల్గవ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నారని, ఈ ఈవెంట్ కి చిరంజీవిని ముఖ్య అతిధిగా పిలిచేందుకే నిర్మాతలు ఆయన ఇంటికి వెళ్లారని అంటున్నారు. వీటిల్లో ఏది నిజమో తెలియాల్సి ఉంది. మరోపక్క ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, చెన్నై, నార్త్ ఇండియా ఇలా అన్ని ప్రాంతాల్లోనూ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. చూస్తూనే మొదటి రోజే ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.