Allu Sirish pre wedding reception: ఈ నెల 6వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish) వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం లో అల్లు అర్జున్ తన తమ్ముడి కోసం హైదరాబాద్ లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలను నిన్న రాత్రి గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు. కాసేపు ఆయన అల్లు శిరీష్ తో సరదాగా మాట్లాడుతున్న వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ పెళ్లి వేడుకకు అక్కినేని నాగార్జున , నాగ చైతన్య, నందమూరి బాలకృష్ణ , మాస్ మహారాజ రవితేజ వంటి టాప్ స్టార్ హేరియలు హాజరయ్యారు. అంతే కాకుండా అల్లు ఫ్యామిలీ తో ఎంతో సన్నిహితంగా ఉండే రానా దగ్గుబాటి ఈ ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
వీళ్ళతో పాటు సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ , సాయి ధరమ్ తేజ్ , పంజా వైష్ణవ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, నేచురల్ స్టార్ నాని, మోహన్ బాబు, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, డైరెక్టర్ అట్లీ, బ్రహ్మానందం, తమన్ , అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని కమెడియన్ అలీ తదితరులు హాజరయ్యారు. అయితే మెగా ఫ్యామిలీ కి చెందిన మెగాస్టార్ చిరంజీవి -సురేఖ దంపతులు, పవన్ కళ్యాణ్ – అన్నా లెజినోవా దంపతులు మాత్రం ఈ వేడుకలో కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి రాకపోవడానికి ముఖ్య కారణం , ఆయన చేతికి రీసెంట్ గానే సర్జరీ జరగడం వల్లే అని తెలుస్తోంది. రీసెంట్ గా అల్లు అరవింద్ కుటుంబం మొత్తం చిరంజీవి ని కలిసి మొట్టమొదటి శుభలేఖ ని అందించిన ఫోటోలు సోషల్ మీడియా లో రావడం , అందులో చిరంజీవి చేతి కట్టుతో ఉండడాన్ని చూసి ఫ్యాన్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత చిరంజీవి సర్జరీ జరిగింది, విశ్రాంతి తీసుకుంటున్నాను, కోలుకుంటున్నాను అని క్లారిటీ ఇవ్వడం తో ఫ్యాన్స్ చల్లబడ్డారు. అయితే ఇంకా కొన్ని రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడం వల్లే ఆయన ఈ వేడుకకు రాలేకపోయాడని, కానీ మార్చి 6న జరగబోయే పెళ్లికి మాత్రం కచ్చితంగా హాజరు అవుతాడని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటున్నాడు. ఆ కారణం చేతనే ఈ వేడుకకు రాలేదు కానీ , పెళ్ళికి మాత్రం కచ్చితంగా వస్తాడని తెలుస్తోంది.