spot_img
Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli- Allu Aravind: రాజమౌళిని మోసం చేసిన అల్లు అరవింద్

SS Rajamouli- Allu Aravind: రాజమౌళిని మోసం చేసిన అల్లు అరవింద్

SS Rajamouli- Allu Aravind: మగధీర.. 40 కోట్ల బడ్జెట్‌ తో 80 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన సినిమా. 2009లోనే ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్లు వచ్చాయా ? అని బాలీవుడ్ సైతం బిత్తరపోయేలా చేసిన సినిమా మగధీర. రాజమౌళి కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన మొదటి సినిమా కూడా మగధీరనే. అప్పట్లో యావ‌త్ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఓ సమ్మోహనాస్త్రం.

SS Rajamouli- Allu Aravind
SS Rajamouli- Allu Aravind

అందుకే.. అప్పుడు మ‌గ‌ధీర క్రియేట్ చేసిన రికార్డుల్లో ఇప్ప‌ట‌కీ కొన్ని ఇంకా చెక్కు చెద‌ర్లేదు. ఈ సినిమా తర్వాతే.. రాజమౌళిలో కొత్త ఉత్సాహం వచ్చింది. వినూత్న నేపథ్యాలు తీసుకుని భారీ చిత్రాలు తీయడం జక్కన్న ఈ చిత్రంతోనే మొదలు పెట్టాడు. అయితే ఈ చిత్రం క్రెడిట్ విష‌యంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి, నిర్మాత అల్లు అర‌వింద్‌ కు మ‌ధ్య కొంత గ్యాప్ వచ్చింది.

Also Read: Rashmi Gautam: రష్మీని ఫిలిం ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానన్న నిర్మాత.. ఆ పని చేసిందట..

ఆ గ్యాప్ కి కారణం.. ఈ చిత్రం విజయాన్ని పూర్తిగా సొంతం చేసుకోవడం కోసం అల్లు అర‌వింద్ క్ర‌మ‌క్ర‌మంగా రాజ‌మౌళిని సైడ్ చేశాడు అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే అర‌వింద్ – రాజ‌మౌళి మ‌ధ్య గ్యాప్‌ కు కారణం ఇది కాదు అని, మ‌రో కార‌ణం ఉందని.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రాజమౌళినే ఓపెన్ అయ్యాడు. అప్ప‌ట్లో ఒక సినిమా హిట్ అయితే.. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు అంటూ థియేటర్ల సెంట‌ర్ల విష‌యంలో ఎక్కువుగా ఫేక్ రికార్డులను అభిమానుల కోసం చూపించాల్సి వచ్చేది.

SS Rajamouli- Allu Aravind
SS Rajamouli- Allu Aravind

మ‌గ‌ధీర విష‌యంలో ఇలాంటి ఫేక్ రికార్డులను అస్సలు ప్రమోట్ చేయకూడదు అంటూ రాజమౌళి ముందే అల్లు అరవింద్ కి చెప్పారు. అర‌వింద్‌ కూడా రాజమౌళి ప్రపోజల్ కి ఓకే చెప్పారు. కానీ, తీరా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాక, రాజమౌళికి ఇచ్చిన మాటను అరవింద్ తప్పారు. పైగా కొన్ని విష‌యాల్లో రాజమౌళిని ప‌క్క‌న పెట్టి మరీ.. 50 – 100 – 175 రోజులు అంటూ అన్ని కోట్లు ఇన్ని కోట్లు అంటూ ఫేక్ రికార్డులు బయటకు వదిలారు.

దీంతో రాజ‌మౌళి బాగా హ‌ర్ట్ అయ్యాడు. పైగా ఈ చిత్రాన్ని త‌మిళంలో కూడా రిలీజ్ చేయ‌మ‌ని రాజమౌళి, అరవింద్ పై ఎంత ఒత్తిడి పెంచినా.. అర‌వింద్ మాత్రం సినిమాని తమిళంలో వెంటనే రిలీజ్ చేయలేదు. తెలుగు ప్ర‌మోష‌న్ల‌లో బిజీ కావడం కారణంగానే.. మగధీర తమిళంలో వెంటనే రిలీజ్ కాలేకపోయింది. ఈ రెండు కార‌ణాల‌తో రాజ‌మౌళి- అర‌వింద్‌ మధ్య గ్యాప్ పెరిగింది. నిజానికి అప్పటి నుంచే రాజమౌళిలో చాలా మార్పు వచ్చింది.

Also Read: Shahrukh Khan OTT Platform: ‘కింగ్ ఖాన్.. ఓటీటీ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper