Allu Arjun : హీరో అల్లు అర్జున్ బేబీ చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక సీరియస్ ఇష్యు లేవనెత్తాడు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తున్నారు. ఎదుగుతున్నారు. మన తెలుగులో మాత్రం తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా లేరు. ఇతర పరిశ్రమల నుండి హీరోయిన్స్ రావడంలో తప్పు లేదు. మన తెలుగు అమ్మాయిలు కనీసం 50 % శాతం ఉండాలి కదా… అవార్డు ఫంక్షన్స్ లో తెలుగు హీరోయిన్స్ ప్రాతినిథ్యం లేదే అని బాధ కలుగుతుంది.
ఎప్పటి నుండో ఈ వేదన నాలో ఉందని అల్లు అర్జున్ అన్నారు. సైమా, ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డు ఫంక్షన్స్ లో ఆయా భాషల సినిమాల అవార్డ్స్ ఆయా భాషల హీరోయిన్స్ తీసుకుంటున్నారు. మన తెలుగు సినిమా అవార్డ్స్ మాత్రం ఇతర భాషల హీరోయిన్స్ తీసుకుంటున్నారు. మన పరిశ్రమకు తెలుగు అమ్మాయిలు రావడం లేదనే అర్థంలో ఆయన మాట్లాడారు. బేబీ మూవీలో లోకల్ గర్ల్ వైష్ణవి చైతన్య నటించిన నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు.
అయితే అల్లు అర్జున్ మాటల్లో స్పష్టత లోపించింది. తెలుగు అమ్మాయిలు పరిశ్రమకు వస్తున్నారు. కానీ స్టార్స్ వాళ్ళను పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఆదరణ దక్కక పక్క పరిశ్రమలకు వెళ్లి ఎదుగుతున్నారు. అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి తమిళ్ లో సక్సెస్ అయ్యారు. ఆ పరిశ్రమ వాళ్ళను అక్కున చేర్చుకుంది. తమిళ్ లో గుర్తింపు వచ్చాక అంజలికి తెలుగులో అవకాశాలు వచ్చాయి. శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.
ఈషా రెబ్బా లాంటి అందం, అభినయం ఉన్న అమ్మాయికి… ఆదరణ అంతంత మాత్రమే. కనీసం సెకండ్ లీడ్ కూడా ఇవ్వడం లేదు. స్టార్స్ సంగతి పక్కన పెడితే లోకల్ మార్కెట్ కలిగిన టైర్ టూ హీరోలకు ఇతర రాష్ట్రాల అమ్మాయిలే కాదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు కనీస ప్రాతినిథ్యం లేదు. ముంబై లేదా కన్నడ, మలయాళీ అమ్మాయిలు పరిశ్రమను ఏలేస్తున్నారు. అల్లు అర్జున్ తెలుగు అమ్మాయిలు పరిశ్రమకు రావడం లేదనేది కరెక్ట్ కాదు. వస్తున్నా వాళ్లకు ఆదరణ దక్కడం లేదు.